టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ “బాహుబలి” సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ముద్ర వేసుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, నాగ్ అశ్విన్ తో కల్కి, మారుతి దర్శకత్వంలో ఓ సినిమా.. సందీప్ వంగ డైరెక్షన్లో మరో చిత్రం ప్రభాస్ చేయనున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో డార్లింగ్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే ప్రభాస్ బాలీవుడ్ లో, టాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోయిన్స్ తో రొమాన్స్ చేశాడు. కానీ ఓ స్టార్ హీరోయిన్ తో మాత్రం ఇప్పటివరకు ఒక్క మూవీ కూడా చేయలేదట.
టాలీవుడ్ మోస్ట్ పాపులర్ హీరోయిన్ సమంత దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన నటించింది. కానీ ప్రభాస్, సమంత కాంబినేషన్లో ఇప్పటికీ ఒక్క సినిమా కూడా రాలేదు. దీంతో ఈ ఇద్దరు స్టార్స్ కలిసి ఒకే స్క్రీన్ పై కనిపిస్తే చూడాలని ఉందని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వీరి కోరికను మేకర్స్ ఎప్పుడు తీరుస్తారో చూడాలి..?