నందమూరి నటసింహ బాలయ్య హోస్ట్‌గా వ్యవహరించిన అన్‌స్టాపబుల్ ఆహాలో ఒక క్రేజీ ప్రోగ్రామ్‌గా మారిపోయింది. అన్ స్టాపబుల్ సీజన్ 1 తో బాలయ్య పేరు ఓ రేంజ్ లో మారుమోగిపోయింది. అన్ స్టాపబుల్ ఆహాకు ఐకానిక్ ప్రోగ్రామ్‌గా మారిపోయింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అదే ఊపుతో సీజన్ 2 కూడా చేశారు. సెలబ్రిటీస్ సరిగ్గా అందకపోవడం.. పైగా బాలయ్య షూట్ లో బిజీగా ఉండడం.. ఈ షో షూట్ కి టైమింగ్స్ సెట్ కాకపోవడంతో మొత్తానికి సీజన్ 2 అయింది అనిపించి ఆపేశారు.
ఇప్పుడు అన్‌స్టాపబుల్ సీజన్ 3 అయితే ప్లాన్ చేయట్లేదట.కానీ కొంతమంది స్టార్ సెలబ్రిటీస్‌తో బాలయ్య ఇంటర్వ్యూ ప్లాన్ చేశారట. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఓ గెస్ట్ గా రాబోతున్నట్లు తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి – బాలయ్య కలిసి ముచ్చట్టించబోతున్నారట. అదే జరిగితే ఆహా తరపున అల్లు అరవింద్ చేసిన ప్రయత్నాలు సక్సెస్ అయినట్లే.
అయితే బాలయ్య – చిరు ఇద్దరి డేట్లు సెట్ అయితే ఈ ఎపిసోడ్ తయారుచేసి దసరా లేదా, న్యూ ఇయర్ రోజున ఓ క్రేజీ ఎపిసోడ్‌లా దీన్ని ప్రసారం చేయాలన్నది ఆహా వారి ప్లాన్ అట. అంత స్టాపబుల్ సీజన్ 1 సీజన్ 2 లాగా ఇది ఎపిసోడ్ వైస్ గా రాదు కానీ అప్పుడప్పుడు కొన్ని కొన్ని ఎపిసోడ్లను మాత్రం రిలీజ్ చేస్తారట ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతుంది.