ఓజి గ్లింప్స్ కట్ పై క్రేజీ టాక్‌ వైరల్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్ గా నటించిన మూవీ ఓజి. సుజిత్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ మూవీ భారీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ గా ప్రేక్షకులు ముందుకు రానుంది. పవన్ సినీ కేర్ లోనే అన్ని సినిమాల కంటే ఎక్కువ హైప్ పవన్ ఓజి పై ప్రేక్ష‌కుల‌లో నెలకొంది.
పవన్ బర్త్డే సందర్భంగా మేకర్ ఈ సెప్టెంబర్ 2న భారీ ట్రీట్ ని ఇస్తున్నట్లుగా అనౌన్స్ చేశారు.

ఇక ఆ భారీ ట్రిట్‌ కోసం పవన్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరి ఆ ట్రీట్ ఏంటనే దానిపై పలు రకాల రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఇక డెఫినెట్గా ఓజి గ్లింప్స్‌గా రావచ్చని సమాచారం. అంతేకాకుండా ఈ వీడియోని మేకర్స్ కోలీవుడ్ యంగ్ యాక్టర్ అర్జునఃదాస్ వాయిస్ ఓవర్ లో రిలీజ్ చేయబోతున్నారట. మరి ఇది నిజమైతే ఆ వాయిస్ ఓవర్‌లో వచ్చే గ్లింప్స్ సెన్సేషన్ రెస్పాన్స్‌ని అందుకోవడం ఖాయం.