ఖుషి సెన్సార్ రివ్యూ.. విజయ్ కెరీర్‌లో రెండోసారి ఇలా జరిగిందే..!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ పెళ్లిచూపులు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమై మొదటి సినిమాతోనే సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. తర్వాత అర్జున్ రెడ్డి సినిమాలో నటించి అతి తక్కువ సమయంలో స్టార్ట్ హీరోగా ఎదిగాడు. అదే క్రేజ్‌లో వరుసగా సినిమాలు చేసినా ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇక ఇటీవల లైగర్ మూవీ తో బిగ్గెస్ట్ డిజాస్టర్ చూసిన విజయ్ ఎలాగైనా తన నెక్స్ట్ సినిమాతో హిట్ కొట్టాలని ఉద్దేశంతో ఖుషి సినిమాలో నటించాడు. ప్యూర్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా సెన్సార్ రివ్యూ లీక్ అయింది. రివ్యూ లో ఏముందో ఒకసారి చూద్దాం.

విజయ్ దేవరకొండ హీరోగా – సమంత హీరోయిన్గా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందిన ఖుషి మూవీ సెప్టెంబర్ 1 ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ మొదలయ్యాయి. అలాగే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్, పలు సాంగ్స్ కూడా రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇటీవల ఈ మూవీ మ్యూజికల్ కాన్సెర్ట్‌ ఏర్పాటు చేశారు. ఇందులో సమంత – విజయ్ దేవరకొండ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు. ఈ సినిమా ప్రమోషన్ కు మ్యూజికల్ కాన్సెర్ట్‌ హైలెట్గా నిలిచింది.

ఇక ఈ సినిమా రిలీజ్ టైం దగ్గర పడడంతో నిర్మాణానంతరం జరగాల్సిన కార్యక్రమాలను జరుపుకుంటున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ సభ్యులు చూసి ఇచ్చిన రివ్యూ లీక్ అయింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ సభ్యులు క్లీన్ యు సర్టిఫికెట్ జారీ చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఖుషి మూవీని చూసిన సెన్సార్ సభ్యులు ఈ కంటెంట్ కు కనెక్ట్ అయ్యారని తెలుస్తుంది.

ముఖ్యంగా ఇందులో ఫ్యామిలీ, యూత్ కనెక్ట్ అయ్యే ఎన్నో అంశాలను కళ్ళకు కట్టినట్లుగా చూపించార‌ట.
తమ‌కి ఈ సినిమా అన్ని వర్గాల ఆడియన్స్‌ని ఆకట్టుకునే విధంగా ఎమోషనల్ రైడ్ లా ఉందని సెన్సార్ సభ్యులు రివ్యూ ఇచ్చారట. విజయ్ దేవరకొండ ఇప్పటివరకు 11 సినిమాల్లో నటించగా అతడు నటించిన మొదటి సినిమా పెళ్లి చూపులకు మాత్రమే క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. దాని తర్వాత ఖుషి సినిమాకే యూ సర్టిఫికెట్ లభించింది. దీంతో ఇది కూడా పెళ్లిచూపులు మూవీ రేంజ్‌లో మంచి సక్సెస్ సొంతం చేసుకుంటుంద‌ని టాక్ వినిపిస్తుంది.