రామ్ చరణ్ – ఉపాసన ఈ జంట పెళై 11 ఏళ్ల గ్యాప్ తర్వాత ఇటీవల ఒక్క ఆడపిల్లకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ పాప పుట్టిన సందర్భంగా ఇటు నానమ్మ – తాతయ్య అటు అమ్మమ్మ – తాతయ్య ఫుల్ ఎంజాయ్ చేస్తూ పాపతో ఆడుకుంటున్నారు. తమ టైం మనవరాలతో స్పెండ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇటు రామ్ చరణ్ కూడా షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చి మరి కూతురుతో ఆడుకుంటున్నాడు. గారాల పట్టి క్లింకారను వదిలి ఉండలేక రామ్ చరణ్ ఎక్కువ టైం ఆమెకే స్పెంట్ చేస్తున్నాడు.
ఇదిలా ఉండగా నిన్న ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా తమ గారాల పట్టి ఫోటోను చూపించి చూపించకుండా షేర్ చేసింది ఉపాసన. ప్రతి ఒక్కరూ ఎంతో గ్రాండ్‌గా 77 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు ఈ నేపథ్యంలో మెగా వారసురాలు క్లింకార కూడా తన మొదటి ఇండిపెండెన్స్ డే వేడుకలను జరుపుకుంది. అంతేకాదు ఆ బుజ్జి చేతులతో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసింది. తన అమ్మమ్మ – తాతయ్యతో కలిసి జండా వందనం చేసింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను ఉపాసన తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసుకుంది.
ఫస్ట్ ఇండిపెండెన్స్ డే విత్ అమ్మమ్మ – తాతయ్య ఇట్స్ వెరీ ప్రిషియస్ టైం అంటూ ఇన్స్టాల్ రాసుకొచ్చింది. ఈ ఫోటోలో లింకార ఫేస్ కనిపించి కనిపించకుండా కవర్ చేశారు. అచ్చు తెలుగు ఆడపిల్లల లంగా జాకెట్ వేసుకొని ట్రెడిషనల్ లుక్ లో కనిపించింది మెగా వారి గారాల పట్టి. ఈ ఫోటోతో పాటు ఉపాసన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ కానీ ఉపాసన కానీ ఎవరు క్లీంకార ఫేస్‌ను రివిల్ చేయలేదు. దీంతో పాప ఫేస్ కొద్దిగా కనిపిస్తుంటే ఇది చాలు అంటూ మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. లవ్ సింబల్ ఇమేజీస్తో కామెంట్ బాక్స్ నింపేశారు.