సమంత కష్టం చెప్పలేను.. ఆమె ముఖంలో నవ్వు చూడాలి..విజ‌య్‌..!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ – సమంత జంటగా ఇటీవల ఖుషి సినిమాను కలిసి నటించిన సంగతి తెలిసిందే. శివా నిర్వహణ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్1న‌ ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీం హైదరాబాద్లో మ్యూజికల్ కాన్సెర్ట్‌ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా విజయ్ మాట్లాడుతూ సెప్టెంబర్ 1 నా తరఫున ఖుషి తీసుకొస్తున్న. మీరంతా నవ్వుతూ బయటకు వచ్చిన సినిమాను ఎప్పుడు తీసుకొచ్చానో నాకు గుర్తులేదు. విజయ్ బ్రో సెప్టెంబర్ 1న మీ ముఖంలో నవ్వు చూడాలని ఉంది అన్నాడు.

అంటూ శివ నాకు నెల రోజుల నుంచి చెబుతున్నాడు.. నాకు మాత్రం నా ముఖంలో కాదు సమంత ముఖంలో నవ్వు చూడాలని ఉంది. ఆమె ఈ మూవీ కోసం ఎంత కష్టపడిందో నేను స్వయంగా చూశాను. గత ఏడాది ఏప్రిల్ లో స్మైలీ ఫేస్ తో సినిమాలు ప్రారంభించాం. సినిమా షూటింగ్ లాస్ట్ కి వచ్చే టైంకి సమంత ఆరోగ్యం బాగా దెబ్బతింది. స్క్రీన్ పై బానే కనిపిస్తుంది కదా అని మేము లైట్ తీసుకున్నాం తర్వాత ఆమె ఆరోగ్య పరిస్థితి మాకు అర్థమైంది. కొన్ని రోజులు విరామం తీసుకోమని చెప్పాం తర్వాత నేను వేరే సినిమా ప్రమోషన్లో ఉండగా ఆమె కండిషన్ గురించి తెలిసింది అని చెప్పుకొచ్చాడు విజయ్.

 

 

 

 

 

ఇక సమంత అభిమానుల గురించి మాట్లాడుతూ మీరంతా మా పాటలు ఎంజాయ్ చేయడానికి ప్రత్యేకంగా చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మీతో కలిసి సినిమాను చూడాలనిపిస్తుంది. ఖుషి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నిర్మాతలు రవి, నవీన్ గారు నన్ను అర్థం చేసుకున్నారు. ఆ విషయాన్ని నేను ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటా. విజయ్, శివల ఓ బ్లాక్ బస్టర్ సినిమా తీసే క్యాబబులిటీ పైన నాకు ఎటువంటి సందేహం లేదు అంటు వివ‌రించింది. మీకోసం పూర్తి ఆరోగ్యంగా తిరిగి వస్తా బ్లాక్ బాస్టర్ ఇస్తా అని సమంత అభిమన్యులతో చెప్పింది.