మధుమేహంతో జుట్టు వేగంగా రాలుతుందా…. అయితే ఈ నియమాలను పాటించండి…..!!

నేటి కాలంలో షుగర్ ఒక సాధారణ వ్యాధిగా మారింది. మన తీసుకునే చెడు ఆహారం అనేక వ్యాధులకు కారణమవుతుంది. అటువంటి పరిస్థితులో ప్రజలు శరీరంలోని షుగర్ ని తగ్గించుకోవడానికి మందులతో పాటు అనేక జాగ్రత్తలు తీసుకుంటూన్నారు. షుగర్ సరైన జీవనశైలని అనుసరించడం ద్వారా కూడా తగ్గించవచ్చు. ఎందుకంటే మధుమేహం కంట్రోట్‌టో లేకపోతే మన శరీరంలో అనేక సమస్యలు మొదలవుతాయి. నిజానికి మన రోగ నిరోధిక శక్తి బలహీనపడుతుంది.

ఈ క్రమంగా రక్త ప్రసరణలో మార్పు మరియు శరీరంలో బలహీనత ఏర్పడుతుంది. దీనికి క్రమంగా జుట్టు కూడా వేగంగా రాల‌డం ప్రారంభం అవుతుంది. ఈ న‌నేప‌ద్యంలో షుగర్ ని కంట్రోల్ లో పెట్టుకోవాలంటే పాటించాల్సిన‌ నియమాలను చూద్దాం. ఒక నివేదిక ప్రకారం సాధారణంగా రోజుకు ఒక వ్యక్తికి 50 నుంచి 100 వెంట్రుకలు రాలడం సహజం. ఇది వాతావరణ మార్పుల్లో మరింత పెరుగుతుంది. దీనితో పాటు, ఒత్తిడితో బాధపడుతున్న వ్యక్తి లేదా గర్భిణీ స్త్రీలకు కూడా హార్మోన్స్ ప్రభావం వల్ల జుట్టు రాలుతూ ఉంటుంది.

రక్తంలో చక్కెర తగ్గినప్పటికీ మీ జుట్టు వేగంగా రాలిపోవచ్చు. షుగర్ రోగులలో

ఒత్తిడి సమస్య చాలా సాధారణంగా ఎదురవుతుంది. దీనికి కారణంగా శరీరంలో కార్టిసాల్ స్థాయి పెరుగుతుంది. ఇది జుట్టు రాలడానికి కారణం అవుతుంది. మీరు మీ రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించగలిగితే జుట్టు రాలడాన్ని కూడా తగ్గించవచ్చు. దీనికోసం మీరు సమతుల ఆహారాన్ని తినాలి. మధుమేహం ఉన్నవారికి ఎక్సర్సైజులు బాగా పనిచేస్తాయి. దీనివల్ల జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. షుగర్ ఉన్నవారు నీరు ఎక్కువగా తాగడం వల్ల బాడీని ప్యూర్ చేస్తుంది.