టాలీవుడ్ లో నెం. 1 హీరో ఎవరు అని సినీ తారలను ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పడానికి కాస్త సంకోచిస్తుంటారు. కానీ, ఎనర్జిటిక్ రామ్ పోతినేని మాత్రం ఎలాంటి మొహమాటం లేకుండా చాలా డేరింగ్ గా తెలుగులో సినీ పరిశ్రమలో నెంబర్ వన్ ఎవరో తేల్చి పడేశాడు. ప్రస్తుతం రామ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
యంగ్ బ్యూటీ శ్రీలీల ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ కెరీర్ లో తెరకెక్కుతున్న తొలి పాన్ ఇండియా చిత్రమిది. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా రామ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ ఫొటోను చూపించి ఆయన గురించి ఒక మాట చెప్పమని యాంకర్ కోరింది.
అందుకు రామ్ బదులిస్తూ.. `బాక్సాఫీస్ కా బాప్.. టాలీవుడ్ నెంబర్ వన్ హీరో` అని కుండబద్దలు కొట్టేశాడు. ఈయన సమాధానంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. ఇకపోతే రామ్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నాడని గత వారం నుంచి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతోనే రామ్ ఏడడుగులు వేసి తన బ్యాచిలర్ లైఫ్ ఎండ్ కార్డ్ వేయబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై ఇంతవరకు రామ్ స్పందించలేదు.