గత ఏడాది విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ `డీజే టిల్లు` మూవీతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ తెరకెక్కబోతోందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు.
ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. చిరంజీవి పెద్దు కూతురు సుస్మిత కొణిదెల ఈ సినిమాను నిర్మించబోతుంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా రానుందని అంటున్నారు. అయితే ఈ సినిమాకు సిద్ధు జొన్నలగడ్డ పుచ్చుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
డీజే టిల్లు హిట్ తో రూ. 3 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తున్న సిద్ధు.. చిరంజీవితో సినిమాకు మాత్రం రూ. 4 కోట్లు అడిగాడట. అయితే మొదట అంత మొత్తం ఇచ్చేందుకు మేకర్స్ నిరాకరించినా.. సిద్ధు వెనక్కి తగ్గకపోవడంతో రూ. 4 కోట్లు ఇచ్చేందుకు ఒప్పుకోక తప్పలేదని ఇన్‌సైడ్ టాక్ నడుస్తోంది. కాగా, ప్రస్తుతం చిరంజీవి `వాల్తేరు వీరయ్య`తో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ పూర్తైన వెంటనే కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలోనే చిరు తన తదుపరి ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించబోతున్నాడని అంటున్నారు.