వివాహం చేసుకోబోతున్న రామ్ పోతినేని..అమ్మాయిఎవరంటే..?

టాలీవుడ్ లో ఎనర్జిటిక్ హీరోగా పేరు పొందిన రామ్ పోతినేని ప్రతి ఒక్కరికి సుపరిచితమే. చివరిగా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నారు .ఆ తర్వాత సరైన సక్సెస్ అందుకోలేక పోతున్నారు. తాజాగా డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమా పాన్ ఇండియా లేవల్లో మార్చి యాక్షన్ చిత్రంగా కెరకెక్కించారు. హీరో రామ్ కెరియర్ లోనే అత్యధిక భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నట్లు తెలుస్తోంది.

BoyapatiRAPO: Ram Pothineni's new look from Boyapati Srinu's film unveiled;  exciting first glimpse to be out on May 15 | The Times of India
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది .ఇప్పటికి ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుందని చెప్పవచ్చు. ఈ చిత్రంతో రామ్ పోతినేని మాస్ హీరోగా మరొకసారి కనిపించబోతున్నట్లు సమాచారం. టాలీవుడ్ లో యంగ్ హీరోలను ఒకరి తర్వాత ఒకరి వివాహం చేసుకుంటున్నారు. 2021 నుంచి ఎక్కువగా నటీనటులు సైతం బ్యాచిలర్ లైఫ్ని వీడి వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు గత కొద్ది రోజుల క్రితం నటుడు శర్వానంద్ కూడా వివాహం చేసుకున్నారు. తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ కూడా లావణ్య త్రిపాఠితో ఎంగేజ్మెంట్ చేసుకోవడం జరిగింది.

ఈ నేపథ్యంలోనే హీరో రామ్ పోతినేని కూడా వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇప్పటికే రామ్ పెళ్లికి సంబంధించి ఒక పెళ్లి కుమార్తెను చూసినట్టు సమాచారం హైదరాబాద్కి చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో వివాహం జరగబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ పెళ్లి ఏడాది ఉంటుందో వచ్చే ఏడాది మొదట్లో ఉంటుందా అనే విషయంపై ఇంకా రామ్ టీం క్లారిటీ ఇవ్వలేదు.. త్వరలోనే ఈ విషయంపై అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.