న్యాచురల్ స్టార్ నాని, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ జంటగా దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన `దసరా` చిత్రం మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో విడుదలై.. తొలి ఆట నుంచే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీతో శ్రీకాంత్ ఓదెలా దర్శకుడిగా పరిచయం అయ్యాడు.
మేకర్స్ పెంచిన భారీ అంచనాలు, టాక్ బాగుండటంతో దసరా తొలి రోజు బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేసింది. నాని కెరీర్ లోనే హయ్యస్ట్ వసూళ్లను రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది. సెకండ్ డే కొంచెం నెమ్మదించినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. అయితే ఇలాంటి సమయంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దసరాకి రివ్యూ ఇచ్చారు.
`దసరా`ను చూసి గర్భపడుతున్నా అని.. ఇది ఒక అద్భుతమైన మూవీ అని కొనియాడుతూ చిత్ర టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు తెలిపాడు. దీంతో నాని మహేష్ కు థ్యాంక్స్ చెప్పాడు. దసరాపై మీరు ప్రశంసలు కురిపించడం పోకిరి సినిమాకు మణిశర్మ సంగీతం లాగా ఉందని నాని రిప్లై ఇచ్చాడు. ఇక మహేష్ రివ్యూ దసరాకు మరించి బూస్ట్ ఇచ్చినట్లు అయింది. సూపర్ స్టార్ అభిమానులు సైతం దసరా వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో బాక్సాఫీస్ వద్ద నాని విధ్వాంసాన్ని ఆపేవాడే లేడంటూ సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు.
Thank you @urstrulyMahesh sir. Your voice of support for good cinema is what Manisharma’s score is for pokiri 🙏🏼♥️ https://t.co/mHxrCsZ1gb
— Hi Nani (@NameisNani) March 31, 2023