రాప్తాడులో టీడీపీకి జోష్..లోకేష్‌తో ప్లస్ ఉందా?

యువగళం పేరిట లోకేష్ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ముగిసిన లోకేష్ పాదయాత్ర..అనంతపురం జిల్లాలో కొనసాగుతుంది. అయితే లోకేష్ పాదయాత్రకు మొదట్లో పెద్ద ఎత్తున ప్రజా స్పందన ఏమి రాలేదు. కానీ నిదానంగా ఆయన ప్రజలతో కలిసే విధానం గాని, యువతని ఆకర్షించే విధంగాని..అన్నీ టి‌డి‌పికి కలిసొస్తున్నాయి. ప్రజలని కలుస్తూ వారి సమస్యలని తెలుసుకుంటూ లోకేష్ ముందుకెళుతున్నారు.

అలాగే యువతతో ఎక్కువ ఇంటారక్ట్ అవ్వడం పెద్ద ప్లస్. ఇలా లోకేష్ పాదయాత్రతో టి‌డి‌పికి అడ్వాంటేజ్ అవుతుంది. అలాగే ఆయన పర్యటించే నియోజకవర్గాల్లో టి‌డి‌పికి కాస్త ప్లస్ అవుతుంది. ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పార్టీకి కాస్త మైలేజ్ వచ్చింది. ఇప్పుడు అనంతలో ఆయన పాదయాత్ర కొనసాగుతుంది. కదిరి, పెనుకొండ నియోజకవర్గాల్లో పాదయాత్ర పూర్తి అయింది. ఇప్పుడు రాప్తాడులో పాదయాత్ర కొనసాగుతుంది. కదిరి, పెనుకొండ స్థానాల్లో టి‌డి‌పికి మంచి జోష్ వచ్చింది. ఇప్పుడు రాప్తాడులో కూడా మంచి స్పందన వస్తుంది.

 

అయితే గత ఎన్నికల్లో ఇక్కడ పరిటాల శ్రీరామ్ పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత టి‌డి‌పి నిదానంగా పుంజుకుంటూ వస్తుంది. కాకపోతే అనుకున్న మేర టి‌డి‌పి పుంజుకోలేదని ఈ మధ్య సర్వేల్లో తేలింది. ఇంకా ఇక్కడ వైసీపీకి స్వల్ప ఆధిక్యం ఉందని తేలింది. దీంతో పరిటాల ఫ్యామిలీకి కాస్త ఇబ్బందిగా మారింది.

ఇలాంటి పరిణామాల నేపథ్యంలో లోకేష్ పాదయాత్ర చేయడం రాప్తాడులో టి‌డి‌పికి ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. ఆయన అన్నీ వర్గాల ప్రజలని కలుపుకుని ముందుకెళుతూ..అక్కడ పార్టీ బలోపేతంపై కూడా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తానికి లోకేష్ తో రాప్తాడులో టి‌డి‌పికి కాస్త ఊపు వస్తుందని చెప్పవచ్చు.