రాజమౌళి లెజెండ్రీ డైరెక్టర్ కోడి రామకృష్ణ తో… కలిసి నటించిన సినిమా ఏంటో తెలుసా..!

తెలుగు చిత్ర పరిశ్రమలో రాజమౌళి అనే పేరుకు ఒక బ్రాండ్ ఉంది.. ఆయన గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే… బాహుబలి- త్రిబుల్ ఆర్ సినిమాలతో టాలీవుడ్ ను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లాడు.. ఆయన సినిమా వస్తుందంటేనే భారతదేశం మొత్తం ఎంతో ఉత్కంఠ గా ఎదురు చేసేలా ఆయన సినిమాలపై ఆసక్తి పెరిగింది.. ప్రస్తుతం రాజమౌళి తన తర్వాతి సినిమాని మహేష్ బాబు తో ప్లాన్ చేస్తున్నాడు. రాజమౌళి తను ఇప్పుడు వరకు తీసిన ఏ సినిమా కూడా ప్లాఫ్ అవ్వలేదు.

ఇప్పటికి 12 సినిమాలు తీశాడు రాజమౌళి ఒక సినిమాను మించి మరొకటి ఉందిగానీ ఏ సినిమా ఒక విధంగా లేదు. రాజమౌళి తాను చేసే సినిమాలలో స్పెషల్ రోల్ చేస్తుంటాడు. బాహుబలి లో కూడా ఆయన ఒక రోల్‌ చేశాడు.. త్రిబుల్ ఆర్ లో కూడా క్లైమాక్స్ వచ్చే పాటలో కనిపించాడు. రాజమౌళి ఆయన సినిమాలో కాకుండా టాలీవుడ్ లో ఉన్న కొందరు దర్శకులు సినిమాల్లో కనిపించాడు. ఆ సినిమాలు ఏంటో ఆదర్శకులు ఎవరు ఇప్పుడు చూద్దాం.

రాజమౌళి నటించి ఫ్లాప్ అయిన సినిమా ఏదో మీకు తెలుసా

టాలీవుడ్ లెజెండ్రీ దర్శకులలో ఒకరైన కోడి రామకృష్ణ, రాజమౌళి వీళ్లిద్దరూ కలిసి ఓ సినిమాలో నటించారు.ఆ సినిమాను మ‌రి ఏదో కాదు వీఎన్ ఆదిత్య తెరకెక్కించిన రెయిన్‌బో. ఈ సినిమాలు వీళ్ళిద్దరూ అతిథి పాత్రలో కనిపించారు. ఆ సినిమా ప్రేక్షకులను అంతాగా మెప్పించలేక పోయింది. అలా రాజమౌళి తొలిసారిగా ఇతర దర్శకుల సినిమాలో నటించిన మొదటి సినిమా అట్టర్ ప్లాప్ సినిమాగా మిగిలిపోయింది. అప్పటినుంచి రాజమౌళి ఇతర దర్శకుల సినిమాల్లో ఎప్పుడూ కనిపించలేదు.. రీసెంట్ గా నాని హీరోగా వచ్చిన మజ్ను సినిమాలో ఒక చిన్న రోల్ చేశాడు. ఆ సినిమా త‌ర్వాత‌ రాజమౌళి ఏ సినిమాలో కనిపించ‌లేదు.