కోలీవుడ్ సీనియర్ హీరో అజిత్ కుమార్ హీరోగా హెచ్ వినోద్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం వలిమై. బే వ్యూ ప్రాజెక్ట్స్ మరియు జీ స్టూడియోస్ పతాకంపై సంయుక్తంగా ఈ సినిమా తెరకెక్కింది. బాలీవుడ్ సీనియర్ నిర్మాత బోనీకపూర్ ఈ సినిమాను నిర్మించారు. యువన్ శంకర్‌రాజా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కింది. తెలుగులో కూడా రిలీజ్ అయ్యి మంచి హిట్ అయిన కార్తీ ఖాకీ సినిమా తెరకెక్కించిన వినోద్ ఈ సినిమాను కూడా అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు.
బైక్ రేస్‌ల నేపథ్యంలో సాగిన యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను కళ్లు జిగేల్ మనిపించాయి. అసలు ఈ సినిమాలో ఫైట్లు, యాక్షన్ సీన్లు చూస్తున్నంత సేపు మనం హాలీవుడ్ సినిమా చూస్తున్నామా ? అన్నట్టుగా కొనసాగాయి. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ సినిమా ఇప్పటికే కోలీవుడ్‌లో సెన్షేషన్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటి వరకు వలీమై రు. 100 కోట్ల వసూళ్లు రాబట్టింది.
పలు సెంటర్లలో అజిత్ అదిరిపోయే రికార్డులు సెట్ చేస్తున్నాడు. కరోనా వైరస్ పరిస్థితుల తర్వాత ఈ తరహా హిట్ సాధించడం తో ప్రేక్షకులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓవర్సీస్తో పాటు అరబ్ కంట్రీస్‌లో కూడా వలిమై సినిమాకు అదిరిపోయే వసూళ్లు వస్తున్నాయి. హ్యూమా ఖురేషీ హీరోయిన్గా నటించిన ఈ సినిమా లాంగ్ రన్లో మరిన్ని వసూళ్లు సాధిస్తుందని అంటున్నారు.