వైరల్ :మోడీ ప్రశంసలు అందుకున్న ఈ యువ హీరో ఎవరో తెలుసా..?

చదువు పరంగా ఇంజనీరింగ్లో టాపర్ గా నిలిచి, ఫిలిమ్ అకాడమీలో శిక్షణ పొంది సంచలన దర్శకుడు మారుతి దర్శకత్వంలో వచ్చిన “భద్రం బీకేర్ ఫుల్ బ్రదర్” ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు యువహీరో దాసిరెడ్డి. ఇక తాజాగా హాలీవుడ్లో కూడా పరిచయం కాబోతున్నాడు ఈ యువహీరో. అందుకు సంబంధించి వివరాలను కూడా త్వరలో అధికారికంగా వెలువడనున్నాయి.

ఇటీవల కాలంలో సైమా అవార్డ్స్ లో పాల్గొనడం చాలా సంతోషాన్నిచ్చింది అంటూ రాజ్ దాసురెడ్డి.. మన తెలుగు వారంతా గర్వించదగ్గ ఎలా హాలీవుడ్లో తన కెరీర్ను తీర్చిదిద్దికుంటానని,చెప్పుకొచ్చాడు. ఇక అంతే కాకుండా తెలుగు ఇండస్ట్రీలో కూడా కొన్ని చిత్రాల కోసం చర్చలు జరుగుతున్నాయని తెలియజేశాడు.

ఈరోజు ఈ హీరో పుట్టిన రోజు సందర్భంగా.. మన భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా దాసిరెడ్డి కి శుభాకాంక్షలు రాయడం విశేషం గా మారింది. మోడీ నుంచి ఆశీర్వాదం అందుకోవడం అంటే చాలా గర్వంగా ఉందని తెలియజేస్తున్నాడు. ఇక ఈ హీరో హాలీవుడ్ లోనూ కూడా విజయకేతనం ఎగురవేయాలని కోరుకుందాం.