ఈశ్వరా… పవనేశ్వరా.. అనే పాట వినపడితే చాలు గుర్తొచ్చే పేరు బండ్ల గణేష్. ఆయన ఆడియో ఫంక్షన్స్ లలో చేసే హంగామా మాములుగా ఉండదు కదా మరి. మొదట కమెడియన్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఆ తర్వాత మెల్ల మెల్లగా ప్రొడ్యూసర్ స్థాయికి ఎదిగి చాలా సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. అలాగే బండ్ల గణేష్ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటారు.ఆయన ఏదన్నా ఒక ట్వీట్ చేసారంటే అది క్షణాల్లో వైరల్ గా మారిపోతుంది.
సోషల్ మీడియాలో సైతం ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. ఏమైందో ఏమో తెలియదు కానీ బండ్ల గణేష్ ఉన్నటుండి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ను క్లోజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ట్వీటర్కు ఇంకా నా గుడ్‌బై అని తనకి ఎలాంటి కాంట్రవర్సీలు, వివాదాలు లేని జీవితాన్ని గడపాలని అనుకుంటున్నా’అని బండ్ల ట్వీట్ చేశాడు.ఆ ట్వీట్ చుసిన ఆయన ఫాలోవర్స్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యి అసలు ఏమైంది? ఎందుకు ట్విట్టర్ నుండితప్పుకుంటున్నారు అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
త్వరలో కి ట్విట్టర్ కి గుడ్ బాయ్ చెప్పేస్తా No controversies. I don’t want any controversies in my life ?
— BANDLA GANESH. (@ganeshbandla) August 14, 2021