” మన శంకర్ వరప్రసాద్ గారు ” ఓటిటి ప్లాట్ఫామ్ ఫిక్స్.. రికార్డ్ రేటుకు డిజిటల్ రైట్స్..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. అనిల్ రావిపూడి కాంబోలో పొందుతున్న లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు. సంక్రాంతి బరిలో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతుంది. ఈసారి చిరంజీవితో మరోసారి బ్లాక్ బస్టర్ కొట్టేందుకు భారీ ప్లాన్‌తో సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలోనే.. ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ టీజ‌ర్, పోస్టర్స్ నుంచి రిలీజ్ అయిన ప్రతి ఒక్క సాంగ్ ఆడియ‌న్స్‌లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఈ క్రమంలోనే సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇక తాజాగా రిలీజ్ అయిన శశిరేఖ సాంగ్‌తో హైప్‌ డబల్ అయిందనడంలో సందేహం లేదు.

First single promo from 'MSVP Garu' impresses

మెగాస్టార్ చిరు, నయ‌నతార ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ మ‌రో కీలక పాత్రలో మెరవనున్నారు. ఇక.. తాజాగా ఈ సినిమా ఓటీటీ డీల్‌కు సంబంధించిన క్రేజీ అప్డేట్ నెటింట‌ తెగ వైరల్‌గా మారుతుంది. 2026 సంక్రాంతి బ‌రిలో సినిమా రిలీజ్ కానున్న క్ర‌మంలో ఇప్పటికే సినిమా ఓటీటీ రైట్స్ అమ్ముడైపోయాయట. అది కూడా.. చిరంజీవి కెరీర్‌లోనే మొదటిసారి ఇంత భారీ ధరకు శాటిలైట్ హక్కులను జి నెట్వర్క్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక.. సినిమా ఓటీటీ సాటిలైట్ రైట్స్ కోసం మొదటి నుంచి భారీ డిమాండ్ నెలకొంది. దీనికి ప్రధాన కారణం సక్సెస్‌ఫుల్ కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెర‌కెక్క‌డమే.

Chiru's MSG Sasirekha: Vibrant Conversational Song

అనిల్ సినిమా అంటే కామెడీ దగ్గర నుంచి యాక్షన్, ఫ్యామిలీ, సెంటిమెంట్ ఇలా ప్రతి ఒక్కటి మిక్స్ చేసి కంటెంట్‌తో ఆకట్టుకుంటాడు. అలాంటిది మెగాస్టార్‌ను స్క్రీన్ పై చూపించడం అంటే ఏ రేంజ్ లో ప్లాన్ చేసి ఉంటాడు అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. ఈ క్రమంలోనే సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్‌లో హైప్‌ డబల్ చేశాయి. ఇక పండగ పోటీ కారణంగా.. సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్లలో ఎక్కువగా ఆడియన్స్‌ చూడలేకపోయినా.. ఖచ్చితంగా ఫ్యామిలీతో కలిసి ఓటీటీలో చూసేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఈ క్రమంలోనే ఓటీటీ హక్కులకు కూడా భారీ డిమాండ్ నెలకొంది. ఈ క్రమంలోనే దాదాపు రూ.55 నుంచి రూ.60 కోట్ల బడ్జెట్ పెట్టి డిజిట‌ల్ హ‌క్కులు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది.