టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా అందరూ స్టార్ హీరోల కామన్ ఫేవరెట్ అంటే విక్టరీ వెంకటేష్ పేరే వినిపిస్తోంది. ఇక విక్టరీ వెంకటేష్.. ప్రస్తుతం మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఆడియన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫ్యామిలీ సినిమాల హీరోగా వెంకటేష్‌కు ప్రత్యేక ఇమేజ్ ఉంది. అంతేకాదు.. ఆయన కామెడీతో పాటు ఎమోషన్స్ కూడా ఆడియన్స్ హృదయాలను హత్తుకుంటాయి. ఇక మిక్స్డ్ ఎమోషన్స్ తో విలువలను తెలియజేసేలా సినిమాలను తెరకెక్కించడంలో త్రివిక్రమ్ ముందుంటాడు.
ఈ క్రమంలోనే వీళ్ళిద్దరి కాంబోపై ఆడియన్స్‌లో అనౌన్స్మెంట్ అప్పటి నుంచే మంచి హైప్ మొదలైంది. ఇక తాజాగా.. సినిమా టైటిల్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా లోగోని గమనిస్తే ఇదొక ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ స్టోరీగా అర్థమవుతుంది. అయితే.. ఈ కథలో ఆడియన్స్‌లో ఆసక్తిని పెంచే అంశాలు కూడా చాలానే ఉన్నాయట. మరీ బ్రీఫ్‌గా గమనిస్తే టైటిల్‌లో రక్తం కూడా కనిపించింది. దీంతో.. ఈ సినిమా ఒక థ్రిల్లర్ మోడ్‌లో కొనసాగుతుందని అంటున్నారు. ఇదే వాస్తవమైతే త్రివిక్రమ్ మొదటిసారి అలాంటి జానర్‌ను టచ్ చేసినట్లు అవుతుంది.

దానికి తోడు.. ఇటీవల కాలంలో థ్రిల్లర్ సినిమాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. అలాంటి టైంలో త్రివిక్రమ్ నుంచి ఒక థ్రిల్లర్ కథ పుడితే మాత్రం ఆడియన్స్‌లో నెక్స్ట్ లెవెల్లో హైప్ క్రియేట్ అవుతుంది. ఎంటర్టైన్మెంట్ పక్క అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో మూవీ అనౌన్స్మెంట్ అభిమానుల్లోనే కాదు.. సాధరణ ఆడియన్స్‌లోను ఆసక్తిని నెలకొల్పింది. పైగా.. త్రివిక్రమ్ స్టైల్ ఎమోషన్స్, కామెడీ ఫ్యామిలీ ఎథిక్స్ మిక్స్ చేస్తూ ఓ సినిమాను రూపొందిస్తాడు. అలాంటి సినిమాలో వెంకటేష్ హీరోగా నటిస్తుంటే.. ఆడియన్స్‌లో ఉత్సాహం మరింతగా పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే.. త్రివిక్రమ్ థ్రిల్లర్ జానెర్ల వెంకటేష్ హీరోగా నటించి.. ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికైనా నిలిచిపోయే మంచి కుటుంబ కథ సినిమా అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి త్రివిక్రమ్ ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకు అందుకుంటాడో చూడాలి.

