రెబల్ స్టార్ ప్రభాస్, మారుతి డైరెక్షన్లో తెరకెక్కనున్న లేటెస్ట్ మూవీ రాజసాబ్.. రిలీజ్ కు టైం ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ సినిమా ఈవారం ధియేటర్లోకి వచ్చేయాల్సింది. కానీ.. టెక్నికల్ సమస్యలతో సినిమా వాయిదాపడి.. సంక్రాంతి బరిలో రిలీజ్ కు సిద్ధమైంది. జనవరి 9న ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. కాగా ఇప్పటికే సినిమా నుంచి ట్రైలర్ రిలీజై ఆడియన్స్ను ఆకట్టుకుంది. ఇక ఇటీవల మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్.. ప్రేక్షకులను డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి. ఇక ప్రభాస్ నుంచి రానున్న ఈ లేటెస్ట్ మూవీ.. యూఎస్ బుకింగ్స్ తాజాగా ప్రారంభమయ్యాయి.

దీంతో సినిమా కు సంబంధించిన ఓ విషయంలో ఫ్యాన్స్ కు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అదే రాజసాబ్ మూవీ రన్ టైం. రాజసాబ్.. ఓవర్సీస్ టికెట్స్ తాజాగా ఆన్లైన్లో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే మూవీ రన్ టైం 3 గంటల 10 నిమిషాలని క్లారిటీ వచ్చేసింది. ఇక గతంలో సినిమా గురించి మాట్లాడుతూ మూడున్నర గంటల పైనే ఉండొచ్చని అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇప్పుడు ఫైనల్ గా మూడు గంటలు పది నిమిషాలకు సినిమాను కుదించినట్టు తెలుస్తోంది. ఇక గతంలో అర్జున్ రెడ్డి, పుష్ప 2, యానిమల్ లాంటి సినిమాలు మూడు గంటలకు పైగా రన్ టైంతో వచ్చి.. మంచి సక్సెస్ అందుకున్నాయి. ప్రేక్షకులు మెప్పించాయి.

ఇక.. ఈ సినిమాల్లోనే డిఫరెంట్ జోనర్లో రాజసాబ్ కూడా తెరకెక్కనుంది. ఈ క్రమంలో.. మూడు గంటలకు పైనే ఉన్న రాజసాబ్ స్టోరీ.. కంటెంట్ పరంగా మెప్పిస్తే సినిమాకు ఎలాంటి సమస్య ఉండదు. కానీ.. సినిమా కొంచెం తడవడి ఆడియన్స్కు బోర్ ఫీల్ కలిగినా.. కలెక్షన్స్ విషయంలో తిప్పలు తప్పవు. ఈ క్రమంలోనే అభిమానుల్లోనూ సినిమా విషయంలో కాస్త టెన్షన్ మొదలైంది. మరి మూడు గంటల పాటు టీం సినిమాతో ఏ రేంజ్ లో మెప్పిస్తారో.. ఆడియన్స్ ని ఎంతలా ఎంగేజ్ చేస్తారో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

