సింహా, లెజెండ్, అఖండ 2 లాంటి హ్యాట్రిక్‌ల తర్వాత బాలయ్య – బోయపాటి కాంబోలో వస్తున్న మూవీ అఖండ 2 తాండవం. అఖండ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందింది. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమా డివోషనల్ టచ్ తో.. హై రేంజ్ మాస్ యాక్షన్ థ్రిల్లర్‌గా డిసెంబర్ 5న అంటే మరో నాలుగు రోజుల్లో గ్రాండ్ లెవెల్ లో ఆడియన్స్‌ను పలకరించనుంది. ఇక ఈ సినిమాల్లో బాలయ్య అఘోర పాత్ర, రుద్రతాండవం.. ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోని సినిమా నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ పోస్టర్, గ్లింప్స్, ట్రైలర్స్ తో పాటు సాంగ్స్ ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి.
దానికి తగ్గట్లుగా సినిమాలో ఎలివేషన్స్, బిజిఎం, విజువల్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని సమాచారం. ఇక ఈ సినిమాను బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి 3డీ వర్షన్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. ఇక మరి కొద్ది రోజుల్లో గ్రాండ్ లెవెల్లో సినిమా రిలీజ్ కానున్న క్రమంలో.. తాజాగా సినిమా సెన్సార్ ను కంప్లీట్ చేసుకుంది. ఇక ఇప్పటికే మూవీ చూసేసిన సెన్సార్ సభ్యుల రివ్యూ ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. 2021లో వచ్చిన అఖండకు సీక్వెల్ గా అఖండ 2 తాండవం రానుంది. ఫస్ట్ పార్ట్‌ను మించిపోయేలా.. తాండవం పేరుకు తగ్గట్టు.. బాలయ్య రుద్ర తాండవంని సిల్వర్ స్క్రీన్‌పై ఎంజాయ్ చేయొచ్చట. ఇక.. సినిమాకు యూఎస్ సర్టిఫికెట్ ఇచ్చిన క్రమంలో.. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ మూవీని ఎంజాయ్ చేయొచ్చని.. సెన్సార్ సభ్యులు వెల్లడించారు.
ఇక భారతీయ సంస్కృతి, సనాతన హిందూ ధర్మం, శివ తత్వాన్ని.. మంచు కొండల్లో మహాశివుని రుద్రతాండవాన్ని అద్భుతంగా సినిమాల్లో ఆవిష్కరించారని టాక్. ఓవైపు శివతత్వాన్ని, సనాతన ధర్మాన్ని అందరికీ అర్థమయ్యేలా చెబుతూనే మరో పక్క ట్రెండ్ కి తగ్గట్టు మాస్ అంశాలను కూడా జోడించారట. థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ నిజంగానే థియేటర్స్ లో గూస్ బంప్ తెప్పించేలా ఉందని సెన్సార్ సభ్యులు వ్యక్తం చేసినట్లు సమాచారం. మొత్తానికి బాలయ్య మాస్ తాండవం మళ్లీ వెండితెరపై చూడబోతున్నామని సెన్సార్ రివ్యూ తో క్లారిటీ వచ్చేస్తుంది. ఇక ప్రస్తుతం సెన్సార్ రివ్యూ వైరల్ అవ్వడంతో ఫ్యాన్స్‌లో మరింత ఆసక్తి పెరిగింది. కచ్చితంగా.. ఈ సినిమాతో బాలయ్య కొత్త రికార్డులు క్రియేట్ చేస్తాడని.. బాక్సాఫీస్ బ్లాస్ట్ చేస్తాడంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.


