టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెసఫుల్ దర్శకులుగా ఎదగడానికి ఎంతో మంది కష్టపడుతుంటారు. అహర్నిశలు శ్రమిస్తారు. కానీ.. రాజమౌళి లాంటి దర్శకుడు ఎంతో మందికి ఇన్స్పిరేషన్. ఆయన తాను పడే కష్టంతో పాటు.. తనతో పని చేసే ప్రతి ఒక్కరిని అదే రేంజ్లో సినిమా కోసం కష్టపడేలా చేస్తారు. ఫైనల్ అవుట్‌ఫుట్ తో బ్లాక్ బస్టర్ అందుకుంటాడు. అందుకే.. రాజమౌళి డైరెక్షన్లో సినిమాలు చేయడానికి పాన్ ఇండియా లెవెల్లో ఎంతోమంది స్టార్ హీరోలు ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ఇప్పటివరకు తాను చేసిన ప్రతి సినిమా.. ఒకదాన్ని మించిపోయి మరొకటి సూపర్ సక్సెస్‌లను సాధిస్తూ వస్తున్నాయి.

ఆయనకు ఇండియాలోనే భారీ మార్కెట్ సొంతమవుతుంది. ఇక ఇప్పుడు.. రాజమౌళి పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ మార్కెట్రను టార్గెట్ చేస్తూ మహేష్‌తో వారణాసి ప్రాజెక్టును చేస్తున్నాడు. ఈ సినిమాతో.. ఎలాగైనా సూపర్ డూపర్ సక్సెస్ కొట్టాలని దృఢ సంకల్పంతో దూసుకు వెళ్తున్నాడు. తను అనుకున్నట్టే.. సినిమా బ్లాక్ బస్టర్ కొడితే మాత్రం తెలుగు సినిమాకి అది ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తుందటంలో సందేహం లేదు. సినిమా అప్డేట్స్ను పంచుకుంటూ.. నిన్న రామోజీ ఫిలిం సిటీ లో గ్రాండ్ లెవెల్ లో ఈవెంట్ నిర్వహించారు. ఇప్పటికే మహేష్ ఫస్ట్ లుక్ సంబంధించిన చిన్న గ్లింప్స్ వీడియోను సైతం రిలీజ్ చేశారు. ఆయన ఎద్దుపై కూర్చుని.. చేతుల త్రిశూలం పట్టుకొని ఎగరేసివ్గా ముందుకు వస్తున్న వీడియో ఆడియన్స్ లో థ్రిల్ కలిగిస్తుంది. ఇక.. మహేష్ ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు.

కారణం ఇప్పటివరకు మహేష్ ఆరెంజ్ మాస్ లుక్ లో కనిపించింది లేదు. అలాంటి ఒక పవర్ఫుల్ లుక్ ను.. రాజమౌళి మహేష్ కు డిజైన్ చేశాడు. ఈ క్రమంలోనే రాజమౌళి చేస్తున్న ప్రయోగం వర్కౌట్ అవుతుందని ధీమా ఫ్యాన్స్‌లో మొదలైంది. ఇదిలా ఉంటే.. మహేష్ బాబు లుక్ ను బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన సాక్ష్యం సినిమా నుంచి కాపీ చేశారంటూ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్ సాక్ష్యం సినిమాలో ఎద్దు పై కూర్చుని త్రిశూలంతో ముందుకు వచ్చే వీడియోను షేర్ చేస్తూ.. రాజమౌళి దీన్నే కాపీ చేసాడంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా రాజమౌళి పై ఎన్నీ కాపీ కామెంట్స్ వినిపించినా.. ఆయన రేంజ్,స్టైల్ మాత్రం వేరెంటు ఖచ్చితంగా మూవీ రికార్డ్‌లు బద్ధలు కొడుతుందంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

