ఒకప్పటి టాలీవుడ్ లవర్ బాయ్ ఉదయ్ కిరణ్కు ఇండస్ట్రీలో ఉన్న పేరు ప్రఖ్యాతల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికి లక్షలాది మంది హృదయాల్లో పదిలంగా నిలిచిపోయిన ఉదయ్ కిరణ్.. మరణించి ఎన్ని సంవత్సరాలవుతున్నా.. ఇప్పటికీ ఇండస్ట్రీలో ఎంతోమంది ఆయనను తలుచుకుంటూనే ఉన్నారు. ఇక తను నటించిన చిత్రం, మనసంతా నువ్వే, నువ్వు నేను లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే.. ఉదయ్ కిరణ్ ఈ రేంజ్లో సక్సెస్ అవ్వడం, ఎదగడం ఓర్వలేని కొంతమంది వెనుక లాగడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు.

కాగా.. ఉదయ్ కిరణ్, చిరంజీవి కూతురు సుస్మితమైన వివాహం చేసుకోబోతున్నట్లు అపట్లో అఫీషియల్ గా అనౌన్స్ చేసిన తర్వాత నిశ్చితార్థం క్యాన్సిల్ అయింది. ఈ క్రమంలోనే ఎన్నో రూమర్లు వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఈ సంఘటన తర్వాతే ఉదయ్ కిరణ్ కెరీర్ డౌన్ ఫాల్ కావడంతో చిరంజీవి ఫ్యామిలీ.. తన కూతుర్ని పెళ్లి చేసుకోలేదని.. కోపంతో అతనిపై కక్ష కట్టి వెనక్కి లాగారని.. ఉదయ్ కిరణ్ డిప్రెషన్లోకి వెళ్లి చనిపోవడానికి కూడా మెగా ఫ్యామిలీనే కారణం అంటూ రకరకాల వార్తలు వినిపించాయి. ఈ వార్తలపై అటు ఉదయ్ కిరణ్ కుటుంబంతో పాటు.. మెగా ఫ్యామిలీ సైతం చాలా సందర్భాల్లో రియాక్ట్ అయ్యారు. అసలు అలాంటిదేమీ లేదని క్లియర్ గా చెప్పారు. ఇదిలా ఉంటే తాజాగా ఇంటర్వ్యూలో డైరెక్టర్ విఎన్ ఆదిత్య.. ఉదయ్ కిరణ్ చనిపోయే ఆరు రోజులు ముందు పవన్ గురించి ఏం చెప్పారు అనే విషయాన్ని షేర్ చేసుకున్నాడు. విఎన్. ఆదిత్య, ఉదయ్ కాంబోలో మనసంతా నువ్వే సినిమా వచ్చి మంచి సక్సెస్ అందుకుంది.

కాగా.. ఉదయ్ కిరణ్ చనిపోయే 6 రోజుల ముందు విఎన్ ఆదిత్యకు కాల్ చేసాడట. ఈ క్రమంలోనే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్గా నటించిన అత్తారింటికి దారేది సినిమా అద్భుతంగా ఉందంటూ చెప్పిన ఉదయ్ కిరణ్.. ఇలాంటి ఒక కాన్సెప్ట్ రాయి.. లేకపోతే ఎవరి దగ్గరైనా తెలుసుకో.. ఖచ్చితంగా ఇలాంటి సినిమా ఒకటి చేద్దాం అని అన్నాడని.. ఆయన ఇమేజ్ కంటే తక్కువ కథ అయినా ఈ సినిమాలో పవన్ నటించే బ్లాక్ బస్టర్ కొట్టారు. ఇలాంటి సినిమా మనము చేయాలని వివరించాడట. అంతేకాదు.. నేను మనసంతా నువ్వే 2 చేద్దామని చెప్పినా ఉదయ్ గారు వినిపించుకోలేదని.. ఫ్యామిలీ, ఎమోషన్, క్లాస్ ఈ సినిమాలేవి వద్దు.. ఒక మాస్ కథ చేయాలని చెప్పుకొచ్చాడు అంటూ వివరించాడు. అయితే.. ఇలా కాల్ చేసి సినిమాలకు సంబంధించి మాట్లాడిన ఉదయ్.. ఆరు రోజులకే చనిపోయారని.. వి.ఎన్. అదిత్య వివరిస్తూ ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.

