నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్లో అఖండ 2 సినిమా పనుల్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా ఇప్పటికే ఫిక్స్ చేశాడు బాలయ్య. గోపీచంద్ మల్లినేని డైరెక్షన్లో ఎన్బికె 111 తెరకెక్కనుంది. వీర సింహారెడ్డితో ఇప్పటికే మంచి సక్సెస్ అందుకున్న ఈ కాంబో మళ్లీ రిపీట్ అవుతున్న క్రమంలో ఆడియన్స్‌లో ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమాను పాన్ ఇండియా లెవెల్లో ఊర మాస్ ప్లానింగ్ తో రూపొందించనున్నాడట గోపీచంద్. ఈ క్రమంలోనే సినిమాపై హైప్ పెంచేందుకు పలు అప్డేట్స్ ను రివిల్ చేస్తూ వచ్చాడు.
వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై.. సతీష్ కిలారు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో.. హీరోయిన్ కోసం గతంలో ఎన్నో పేర్లు వినిపించినా.. మేకర్స్ ఫైనల్‌గా ఆమె ఎవరో రివిల్ చేశారు. కొద్దిసేపటి క్రితం.. రాజ్యంలోకి యువరాణి ఎంట్రీ ఖరారైందంటూ.. నయనతార లుక్ రివిల్ చేశారు. నయనతార బర్త్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా రిలీజ్ అయిన ఈ గ్లింప్స్ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. బాలయ్యతో ఇప్పటికే నాలుగు సార్లు హిట్ సినిమాల్లో నటించిన లేడీ సూపర్ స్టార్.. మరోసారి చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఆయనతో జత కట్టడానికి సిద్ధమవుతుంది. గోపీచంద్ మలిన్నేని స్టోరీ నరేషన్ నయనతారకు నచ్చేయడంతో.. వెంటనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.
ఈ సినిమా కోసం అమ్మడు భారీగా రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తుందట. ఇక.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా టీం.. నవంబర్ 26న పూజా కార్యక్రమాలతో మూవీ ప్రారంభించనున్నారట. బాలయ్య కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్.. సినిమాగా ఇది రూపొందనుంది. ఇక.. ఈ సినిమాలో మరో హైలెట్ విషయం ఏమిటంటే టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్.. బాలయ్య లక్కీ ఛాంప్ నందయూరి థమన్ సంగీతం అందించనున్నాడు. ఇందులో భాగంగానే.. తాజాగా రిలీజ్ చేసిన ఎన్బికె 111 క్వీన్స్ బిజిఎం అదిరిపోయిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ గ్లింప్స్‌ని మీరు ఓ లుక్ వేసేయండి.


