ఈ అమ్మడిని గుర్తుపట్టారా.. చేసిన ఒక్క సినిమాతోనే బ్లాక్ బస్టర్.. ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్..!

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టిన చాలా మంది ముద్దుగుమ్మలు.. మొదట్లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా క్రేజ్ దక్కించుకున్న వాళ్లు ఉన్నారు. అలా.. ఇప్పటికే ప్రభాస్‌తో ఫౌజీ చేయనున్న ఇమ‌న్వీ మొదలుకొని.. ఆర్జీవి – శారీ హీరోయిన్ ఆరాధ్య దేవి, పుష్ప 2 – అంచల్ ముంజాల్, ఏజెంట్ హీరోయిన్ సాక్షి వైద్య.. ఇలా ఎంతోమంది హీరోయిన్లు తమ కెరీర్‌ ప్రారంభంలో ఇన్స్టా రీల్స్‌తో పాపులారి దక్కించుకున్న వాళ్లే. ఇప్పుడు.. ఆ జాబితాలోకి మరో అందాల ముద్దుగుమ్మ చేరిపోయింది. ఇక.. ఈ అమ్మడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదటి సినిమాతోనే అదరగొట్టింది. ఫస్ట్ సినిమాతోనే ఏకంగా రూ.50 కోట్ల వసూళ్లను కొల్లగొట్టి సంచలనం సృష్టించింది.

Photos : #Court movie actress #SrideviApalla https://t.co/IEJ64bdx1Z  #123telugu

మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా ట్రెండ్ అయింది. ఇంతకీ ఈమె ఎవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా.. హాట్‌ టాపిక్‌గా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదు.. కాకినాడ పిల్ల శ్రీదేవి. కోర్ట్ సినిమాతో హీరోయిన్గా మారి అందరి హృదయాలను గెలుచుకున్న ఈ ముద్దుగుమ్మ పూర్తి పేరు.. శ్రీదేవి ఆపళ్ళ. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకు ముందు instagramలో పలు రీల్స్‌తో మంచి పాపులారిటి దక్కించుకుంది. ఇక.. కోర్ట్ సినిమాలో అమ్మ‌డికి అవకాశం రావడానికి కూడా ఇన్‌స్టాలో శ్రీదేవి చేసిన ఓ రిలే కారణమట.

Court – State vs. A Nobody Movie Heroine Sridevi Appala: Age, Career,  Education, Family - Cinema Manishi

ఆ రీల్ చూసి కోర్ట్ లో ఆమెకు అవకాశం కల్పించారని ఆ మూవీ డైరెక్టర్ రామ్ జగదీష్ స్వయంగా వెల్లడించాడు. ఇదిలా ఉంటే.. కోర్ట్‌ తర్వాత.. శ్రీదేవి మరో తెలుగు సినిమాలో నటిస్తుంది. అంతేకాకుండా.. ఇప్పుడు ఈ అమ్మడు మ‌రో క్రేజీ ఆఫర్ కొట్టేసింది. కోలీవుడ్ నుంచి ఆఫర్ దక్కినట్లు సమాచారం. కేజీఆర్ అనే నటుడు, నిర్మాత తెర‌కెక్కించనున్న కొత్త సినిమాలో శ్రీదేవి హీరోయిన్ గా ఇప్పటికే సెలెక్ట్ అయింది. ఈ సినిమాలో హీరో ఎవరో ఇప్పటివరకు అనౌన్స్ చేయకపోయినా.. ఓ స్టార్ హీరో మాత్రం ఈ సినిమాలో నటిస్తున్నాడని టాక్ తెగ వైరల్ గా మారుతుంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్ర‌క‌ట‌న రానుందట. ఇక ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీగా మూవీ రూపొంద‌నుంద‌ని సమాచారం.