ఒకప్పుడు డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్‌గా తెలుగులో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న పూరీ జగన్నాథ్.. తన సినీ కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్నారు. ఆయన చేసిన ప్రతి ఒక్క సినిమా ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేది. ఈ క్రమంలోనే.. కమర్షియల్ సినిమాల్లో ఆయనను కొట్టేవారు ఎవరూ లేరని అభిప్రాయాలు సైతం వ్యక్తం అయ్యేవి. ఇక పూరి తెరకెక్కించిన పోకిరి సినిమాతో ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్‌ను సెట్ చేసుకున్నాడు మహేష్. ఈ సినిమా వచ్చిన తర్వాత.. ప్రతి ఒక్కరు పూరీ తీసిన ఈ ఫార్ములాలోనే సినిమాలు తెరకెక్కించడానికి ఆసక్తి చూపేవారు.
ఇక.. అప్పట్లో రాజమౌళి కూడా వరుస సక్సెస్ లను అందుకుంటున్న కెరీర్లో ఒక్క ఇండస్ట్రీ హీట్ కూడా దక్కలేదు. దీంతో.. పూరి జగన్నాథ్‌పై కోపంతో.. భారీ ప్రాజెక్టులు చేయాలని రాజమౌళి ఫిక్స్ అయ్యాడట. అలా చరణ్‌ను పెట్టి.. మగధీర సినిమా చేసి ఆల్ టైం ఇండస్ట్రియల్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అలా.. మగధీర టైంలో రాజమౌళి, పూరీకి మధ్యన స్ట్రాంగ్ పోటీ ఉండేది. ఇక.. రాజమౌళి నెలలు తరబడి సినిమాకు టైం కేటాయిస్తే.. పూరి జగన్నాథ్ మాత్రం ఎలాంటి సినిమా అయినా మూడు నెలల్లో కంప్లీట్ చేసి ఇండస్ట్రియల్ హిట్లు కొట్టేవాడు. అదెలా సాధ్యమవుతుంది అంటూ రాజమౌళి సైతం పలు సందర్భాల్లో పూరి జగన్నాథ్ ను అడిగేవాడట.
అప్పట్లో ఇది పెను సంచలనాన్ని క్రియేట్ చేసింది. ఏదైనా టైమింగ్ విషయంలో పూరి జగన్నాథ్ స్పీడ్‌ను మాత్రం రాజమౌళి క్రాస్ చేయలేకపోయాడు. అయితే.. ప్రస్తుతం రాజమౌళి మాత్రం పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్‌లు అందుకొని.. పాన్ వరల్డ్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తుంటే.. పూరి జగన్నాథ్ ఇటీవల కాలంలో వరుస పాపులను ఎదుర్కొంటూ డీల పడిపోతున్నాడు. ఇక.. ప్రస్తుతం పూరి, విజయ్ సేతుపతి హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ కొట్టి.. ఇండస్ట్రీలో స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలని ఆరాటపడుతున్నాడు. ఇంతకుముందు టాప్ డైరెక్టర్‌గా ఎలాంటి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడో అదే ఇమేజ్ను మళ్ళీ సంపాదించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక పూరీ తాన అనుకున్నట్లు మంచి సక్సెస్ అందుకుంటాడా.. లేదా తెలియాల్సి ఉంది.



