పూరి మూవీలో ఓ క్యారెక్టర్ నుంచి రాజమౌళి సినిమా తీసి సూపర్ హిట్ కొట్టాడా.. ఆ మూవీ ఏంటంటే..?

ఇండియ‌న్‌ సినీ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా తిరుగులేని ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు దర్శకథీరుడు రాజమౌళి. ఆయన చేసిన ప్రతి సినిమాలోను ఏదో ఒక వైవిధ్యతను చూపిస్తూ.. ఆడియ‌న్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటూ వ‌స్తున్నాడు. కథలో పర్ఫెక్షన్‌తో పాటు.. స్క్రీన్ ప్రజెన్స్‌, విజువలైజేషన్, మ్యూజిక్, నటీనటుల యాక్టింగ్.. ఇలా ప్రతి విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలోనే.. తాను అనుకున్నట్లుగా ఇండస్ట్రీలో అద్భుతమైన సక్సెస్‌లతో దూసుకుపోతున్న జ‌క్క‌న‌..మహేష్ బాబు తో వారణాసి ప్రాజెక్టు రూపొందిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Shivamani review: Shivamani (Telugu) Movie Review - fullhyd.com

ఈ మూవీతో రాజమౌళి పాన్ వరల్డ్ మార్కెట్లో టార్గెట్ చేశాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో గుర్తింపు సంపాదించుకుంటాడని ఇప్పటికే ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. రాజమౌళి నుంచి గతంలో వ‌చ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న విక్రమార్కుడు సినిమా లో రవితేజ విక్రమ్ సింగ్ రాథోడ్ క్యారెక్టర్ ను.. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వ‌చ్చిన ఓ సినిమాల్లో క్యారెక్టర్ నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నడట. ఇంతకీ ఆ మూవీ మరేదో కాదు శివమణి. ఈ సినిమాలో నాగార్జున క్యారెక్టర్ ఇన్స్పిరేషన్తో రవితేజ పోలీస్ రోల్ ను డిజైన్ చేసినట్లు తెలుస్తుంది. నిజానికి శివమణిలో నాగార్జున చాలా స్ట్రిక్ట్.. మెంట‌ల్‌ పోలీస్ ఆఫీసర్ గా ఉంటాడు.

Ravi Teja-SS Rajamouli blockbuster 'Vikramarkudu' set to hit theaters  again; makers share re-release trailer | - Times of India

ఇక ఆ క్యారెక్టర్ రాజమౌళికి తెగ నచ్చేసిందట. అదే మెంటల్ పోలీస్ ఎలా ఉంటాడో.. కోపం వస్తే ఏం చేస్తాడు.. అసలు వాడు ఎలా తన డ్యూటీ కంప్లీట్ చేస్తాడు అని ఆలోచన నుంచే విక్రమ్ సింగ్ రాథోడ్ క్యారెక్టర్ పుట్టుకొచ్చిందట. మొత్తానికి పూరి జగన్నాథ్ ఇన్స్పిరేషన్ కారణంగానే విక్రమ్ సింగ్ రాథోడ్ క్యారెక్టర్ పుట్టిందని టాక్‌ ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. ఇక అప్పట్లో పూరి జగన్నాథ్, రాజమౌళి మధ్యన గట్టి పోటీ ఉండేది. అంతేకాదు.. రాజమౌళి ఇప్పటికే చాలా సందర్భాల్లో పూరి జగన్నాథ్ అంటే తనకు చాలా ఇష్టమని వెల్లడించాడు. ఈ క్రమంలోనే పూరి ఒకప్పుడు మేకింగ్ స్టైల్ గురించి, ఆయన అప్పట్లో తీసిన సినిమాలు.. డైలాగ్, సీన్స్ గురించి ఆడియన్స్‌ తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు. అందుకే తనను డేరింగ్ అండ్ డాష్ అండ్ డైరెక్టర్ అని పిలుస్తారంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.