ఇండస్ట్రీ ఏదైనా సరే.. హీరోలుగా ఎంట్రీ ఇచ్చి.. స్టార్ హీరోలుగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న తర్వాత అభిమానులు వాళ్ళకొక స్పెషల్ ట్యాగ్‌ను ఇచ్చేస్తూ ఉంటారు. అలా టాలీవుడ్ లో మెగాస్టార్, పవర్ స్టార్, సుప్రీం స్టార్, నాచురల్ స్టార్, రెబల్ స్టార్, యంగ్ టైగర్ ఇలా రకరకాల ట్యాగ్స్ స్టార్లకు ఫ్యాన్స్ ఇచ్చేసారు. అలాగే.. మెగా పవర్ స్టార్ ట్యాగ్ తో రామ్ చరణ్ ను పిలుస్తూ ఉంటారన్న సంగతి తెలిసిందే. కాగా.. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న తర్వాత.. చరణ్ రేంజ్ ను మరింతగా పెంచేందుకు గేమ్ ఛేంజర్ టైంలో శంకర్.. చరణ్‌ను గ్లోబల్ స్టార్ ట్యాగ్ ఇంట్రడ్యూస్ చేశాడు.

అయితే.. ఈ సినిమాతో చరణ్ ఘోరమైన డిజాస్టర్ ను ఎదుర్కోవడమే కాదు.. విపరీతమైన నెగటివ్ ట్రోల్స్ ను కూడా ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇక.. ఈ సినిమా తర్వాత ప్రస్తుతం బుచ్చిబాబు సనా డైరెక్షన్‌లో చరణ్ పెద్ది సినిమాలో నటిస్తున్నాడు. అయితే.. ఈ సినిమాలో ముందు సినిమాలా గ్లోబల్ స్టార్ ట్యాగ్ కాకుండా.. తన గత ట్యాగ్ మెగా పవర్ స్టార్‌నే వాడుకుంటున్నాడు చరణ్. దీంతో.. ట్యాగ్ విషయంలో రామ్ చరణ్ మనసు మార్చుకున్నాడని.. గ్లోబల్ ట్యాగ్ వర్కౌట్ కాలేదు.. ఈ క్రమంలోనే మళ్లీ మెగా పవర్ స్టార్ ట్యాగ్‌కు మారిపోయాడంటూ టాక్ వైరల్ గా మారుతుంది.
ఇక ఎన్టీఆర్ యంగ్ టైగర్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మొదట్లో చాలా సినిమాలుకు యంగ్ టైగర్ గానే ఆడియన్స్‌ను పలకరించిన తారక్.. తను నటించిన శక్తి సినిమా కోసం మాత్రం ఏ వన్ స్టార్ ట్యాగ్ ఉంచుకున్నాడు. కాగా ఆ సినిమా డిజాస్టర్ కావడంతో.. తర్వాత నుంచి ఏ వన్ స్టార్ అనే ట్యాగ్ తొలగించి.. యంగ్ టైగర్ ట్యాగ్ తోనే కంటిన్యూ అవుతున్నాడు. దీంతో గతంలో తారక్ చేసిన ఇదే పనిని.. చరణ్ ఇప్పుడు ఫాలో అవుతున్నాడని ట్యాగ్ విషయంలో అదే సెంటిమెంట్లు వర్కౌట్ చేస్తున్నాడంటూ.. అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

