ఇండస్ట్రీ ఏదైనా సరే ఓ హీరోగా ఎంట్రీ ఇచ్చి.. స్టార్ హీరోగా ఎలివేట్ అవ్వాలంటే.. ఆడియన్స్ ను ఆకట్టుకోవాలంటే వాళ్ళు ఎంత కష్టపడాల్సి వస్తుంది. అంతేకాదు.. దీనికి మరో ప్రధాన అంశం స్టోరీ సెలక్షన్. కథల ఎంపికలో ఒక్కో హీరోకు క్యాలిక్యులేషన్స్ ఒక్కోలా ఉంటాయి. స్టోరీ సూట్ అవుతుందా లేదా.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా.. కామన్ ఆడియన్స్ కు సినిమా కనెక్ట్ అవుతుందా.. ఇలా రకరకాల సందేహాలను క్లారిఫై చేసుకున్న తర్వాతే సినిమాలో నటిస్తారు. ఈ క్రమంలోనే.. చాలా మంది స్టార్ హీరోలు తమ వద్దకు మంచి కథలు వచ్చినా.. కొన్ని అనాలసిస్‌లతో వాటిని రిజెక్ట్ చేస్తూ ఉంటారు.

తర్వాత.. అదే కథను వేరే హీరోలు నటించి బ్లాక్ బస్టర్ కొట్టడం.. లేదా డిజాస్టర్ ఎదురుకోవడం.. రకరకాల రిజల్ట్స్ చూస్తూ ఉంటారు. కాగా.. అలా గతంలో.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇద్దరు రిజెక్ట్ చేసిన ఒక కథను రాంచరణ్ నటించి.. బ్లాక్ బస్టర్ కొట్టాడంటూ టాక్ వినిపిస్తుంది. ఇంతకి ఆ మూవీ ఎంటో ఒకసారి చూద్దాం. టాలీవుడ్ పవర్ స్టార్ తన సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలను వదులుకున్నాడు. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ సైతం తన కెరీర్ ప్రారంభంలో చాలానే మంచి కథలను రిజెక్ట్ చేస్తూ వచ్చాడు. అయితే.. వీళ్ళిద్దరూ కలిసి రిజెక్ట్ చేసిన ఓ కథతో చరణ్ బ్లాక్ బస్టర్ కొట్టాడు.

ఇంతకీ ఆ మూవీ మరేదో కాదు నాయక్. రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో నటించిన ఈ స్టోరీ మొదట ప్రభాస్ వద్దకు వెళ్లిందట. కానీ.. ప్రభాస్ అప్పటికే మిర్చితో బిజీగా ఉన్న క్రమంలో దానిని వదులుకున్నాడు. అయితే.. ప్రభాస్ కంటే ముందు పవన్ కు వినాయక్ ఈ కథను వినిపించాడని.. ఈ సినిమా చేసేందుకు పవన్ ఇంట్రెస్ట్ చూపలేదని సమాచారం. ఈ క్రమంలోనే తర్వాత రామ్ చరణ్ ను కలిసిన వినాయక్ కథను వినిపించగా.. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నటించాడు. ఇక ఈ సినిమా రిలీజై ఫస్ట్ నుంచి పాజిటివ్ టాక్ దక్కించుకోవడంతో.. బ్లాక్ బస్టర్ రిజల్ట్ అందుకుంది.

