అఖండ 2 కోసం బాలయ్య మాస్ ప్లానింగ్.. రంగంలోకి ఇద్దరు సీఎంలు..!

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ 2. అఖండ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సినిమా సీక్వెల్‌గా తెర‌కెక్కుతున్న క్రమంలో ఈ సినిమాపై ఆడియన్స్‌లో భారీ అంచనాలు మొదలయ్యాయి. గతంలో.. ఎన్నడు లేని విధంగా సినిమాలో బాలయ్య పూర్తిస్థాయి అఘోర పాత్రలో పవర్ ఫుల్ గా కనిపించనున్నాడు. శివతత్వం ఉట్టిపడేలా.. హిందూ సనాతన ధర్మాన్ని స్క్రీన్ పై ఆవిష్కరించామని. మేకర్స్ ఇప్పటికే అఫీషియల్ గా వెల్లడిస్తూ వచ్చారు. ఇక సినిమా కోసం బాలయ్య తన లుక్ ను ఎంతలా మార్చుకున్నాడో చూసాం. ఇక సినిమా డిసెంబర్ 5న‌ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా ప్రమోషన్ చేయాలని బాలయ్య తో పాటు టీమ్ అంతా ఫిక్స్ అయ్యారు.

Akhanda 2 Team Surprises UP CM Yogi Adityanath - Telugu360

ఇందులో భాగంగానే బాలయ్య అఖండ 2 కోసం మాస్ ప్లానింగ్ చేశాడంటూ.. రెండు రాష్ట్రాల సీఎంలను సినిమా కోసం రంగంలోకి దింపుతున్నాడు అంటూ టాక్ వైరల్ గా మారుతుంది. ఇందులో భాగంగానే.. మొన్న యుపి సీఎం యోగి ఆదిత్యనాథ్.. బాలయ్య కలిసిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన ఫిక్స్ సైతం వైరల్ గా మారాయి. ఇప్పుడు సినిమా ప్రమోషన్స్ కోసం రెండు భారీ ఈవెంట్లను టీం ప్లాన్ చేశారు. కాగా.. వాటిలో ఓ ఈవెంట్ హైదరాబాద్‌లో నిర్వహించనున్నారని.. ఈవెంట్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా హాజరుకానున్నడంటూ టాక్‌ వైరల్ గా మారుతుంది. ఇప్పటికే.. ఇది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిందట‌.

Nandamuri Balakrishna Meet CM Revanth Reddy | Telangana CM | Nagarjuna and  Amala Akkineni

త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఉంటుందని సమాచారం. మరో పక్క వారణాసిలో ఇంకో ఈవెంట్ గ్రాండ్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారట. దీనికి యుపి సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పెషల్ గెస్ట్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఎలాగో హిందుత్వం, సనాతన ధర్మం గురించి ఈ సినిమా తెర‌కెక్క‌నుంది.. కనుక యోగి కచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా.. అఖండ 2 కోసం బాలయ్య చాలా పెద్ద ప్లానే వేసినట్లు తెలుస్తుంది. నిజంగానే టీం అనుకున్నట్లు ఈ ఇద్దరు సీఎంలు ఈవెంట్లో హాజరైతే మాత్రం.. సినిమాకు రిలీజ్ కి ముందే భారీ హైప్‌ మొదలవుతుంది.