నందమూరి నటసింహం బాలకృష్ణ లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం. బోయపాటి శ్రీను డైరెక్షన్లో బాలయ్య హీరోగా వస్తున్న నాలుగవ సినిమా ఇది. ఇక వీళ్ల కాంబోలో వచ్చిన 3 సినిమాలు బ్లాక్ బస్టర్లు కావడం.. అఖండ లాంటి సెన్సేషనల్ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 తెరకెక్కనున్న క్రమంలో ఈ సినిమాపై ఆడియన్స్ లో ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక బాలయ్య స్పెషల్ డైలాగ్ డెలివరీతో.. పవర్ ఫుల్ స్క్రీన్ ప్రజెన్స్‌తో మాస్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకోవడంలో దిట్ట. ఈ క్రమంలోనే.. మరోసారి తన మాస్ పవర్‌ను చూపించడానికి అఖండ 2 తాండవంతో సిద్ధమవుతున్నాడు.

ఇక సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్ రిలీజై ఆడియన్స్ లో మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. అఖండ తాండవం కోసం తెలుగు ఆడియన్సే కాదు.. పాన్ ఇండియా లెవెల్ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాల మధ్య మూవీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఈ సినిమా నుంచి తాండవం అనే సాంగ్ మరి కొద్ది గంటల్లో మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఇప్పుడు అందరి దృష్టి దాని వైపే ఉండడం విశేషం. అఖండ 2 తాండవం ప్రమోషన్స్ పాన్ ఇండియా లెవెల్ లో చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు.

అందులో భాగంగానే ఫస్ట్ సాంగ్ లాంచ్ ను ముంబైలో చేయనున్నారు. ఇక అఖండ సినిమాకు మ్యూజిక్ తో స్పీకర్లు పగలగొట్టిన థయన్.. ఈ సినిమాకు సైతం మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు అఖండ 2 కోసం అంతకు మించిపోయే ప్లాన్ చేశారని టాక్ వైరల్ గా మారుతుంది. దానికి తగ్గట్టుగానే.. తాజాగా రిలీజ్ అయిన ఫస్ట్ సింగల్ ప్రోమో ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఇక.. సాంగ్ ఫుల్ లిరిక్స్ కోసం ఏకంగా శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్‌లను రంగంలోకి దింపాడు థమన్. దీంతో.. అందరి దృష్టి ఆ సాంగ్ పైనే ఉంది. ప్రోమో వింటుంటేనే ఇన్స్టెంట్ ఛార్జ్ బూస్టర్ అనే లక్షణాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే.. ఫుల్ సాంగ్ సోషల్ మీడియాను ఏ రేంజ్‌లో బ్లాస్ట్ చేస్తుందో చూడాలి.

