‘ అఖండ 2 ‘ బాలయ్య తప్ప మరే హీరో చెయ్యలేడు.. ఫైట్ మాస్టర్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ అచంటా, గోపి ఆచంట ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక.. థ‌మన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాపై.. ఇప్పటికి ఆడియన్స్‌లో మంచి హైప్‌ మొదలైంది. ఇక సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్.. ఆడిమ‌న్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ త‌క్కించుకున్నాయి. ఇక.. ఈ సినిమాను డిసెంబర్ 5న పాన్ ఇండియా లెవెల్‌లో 2d, 3d రెండు వర్షన్‌ల‌లోనూ రిలీజ్ చేసేలా మేకర్స్‌ ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే.. మూవీ ప్రమోషన్స్ మొదలైపోయాయి.

ఇక.. ఈ ప్రమోషన్స్‌లో తాజాగా ఫైట్ మాస్టర్ రామ్, లక్ష్మణ్ మాట్లాడుతూ.. సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకున్నారు. వాళ్ళిద్దరూ మాట్లాడుతూ.. సినిమాల్లో ఫస్ట్ పార్ట్ మంచి యాక్షన్ ఉంది. అందులో బాలయ్య పాత్రని అఖండగా పరిచయం చేశారు. ఇందులో డైరెక్టర్ బోయపాటి.. అఖండ విశ్వరూపాన్ని చూపించాడు. భగవంతుడు శక్తి తీసుకున్న ఓ హీరో పాత్ర ఢీకొట్టాలంటే.. ప్రత్యర్థి పాత్ర కూడా అంతే బలంగా ఉండాలి.. అలాంటి రోల్ లో ఆది పిన్నిశెట్టి అద్భుతంగా నటించాడు.. డైరెక్టర్ ఆయనకు చాలా వినూత్నమైన గెటప్ ఇచ్చారంటూ చెప్పుకొచ్చారు. ఆది పినిశెట్టి దగ్గర నెగిటివ్ ఎనర్జీ చాలా పవర్ ఫుల్ గా.. అఖండ పాత్రలో పాజిటివ్ ఎనర్జీ బాగా ఉంటుంది.. అలాంటి రెండు శక్తుల మధ్య యాక్షన్ క్రియేట్ చేయడానికి.. కొత్తగా కంపోజ్‌ చేయడానికి మాకు కూడా చాలా స్పేస్ దొరికింది అంటూ వివరించారు.

పాన్ ఇండియా లెవెల్లో సినిమా రిలీజ్ చేయాలని బోయపాటి చాలా కష్టపడ్డారు.. ప్రతి చిన్న విషయం 100% ఇచ్చాడు. అందరం సినిమాను ఎంజాయ్ చేస్తాం. ఆడియన్స్ 100% అంచనాలు పెట్టుకుంటే.. ఈ సినిమా వెయ్యి పర్సెంట్ అంచనాలను అందుకుంటుంది అంటూ చెప్పుకొచ్చారు. ఇక.. ట్రైలర్‌లో మీరు త్రిశూలం, గాన్‌తో పేల్చే యాక్షన్ సీక్వెన్స్‌లు చూసుంటారు. మామూలుగా గన్నే చాలా పవర్ఫుల్.. అలాంటిది త్రిశూలం శక్తి , శివుని మహిమ తోడైతే ఎలా ఉంటుందో.. ఈ పవర్ యాక్షన్ సీక్వెన్స్ లో చూపించాలి అనుకున్నాం.. ఓంకారం శక్తి, శివ శక్తిని మనసారా నమ్మితే ఎంత ఆనందంగా అద్భుతంగా ఉంటుందో బోయపాటి చూపించాడు. సినిమా చూసి ఎంతసేపు ఆడియన్స్ ఓ వైబ్రేషన్‌లోకి వెళ్తారు. శివతత్వాన్ని కడుపునిండా నింపుకుంటారు. ఎక్కడ సినిమా బోర్ కొట్టదు.

యాక్షన్ అద్భుతంగా పండింది అంటూ చెప్పకొచ్చారు. ఇక మేమంటే బాల‌య్య చాలా నమ్ముతారు.. సింహా, లెజెండ్ లాంటి మాస్‌ సినిమాలకు మేమే ఫైట్స్ డిజైన్ చేశాము. అలాంటి మాస్ పాత్రకి ఒక డివైన్ ఎనర్జీ తోడైతే ఎనర్జీ ఎలా ఉంటుందో ఇందులో ఫైట్స్ కంపోజిషన్ తో అర్థమవుతుంది. ఇందులో యాక్షన్ సీక్వెల్స్ చూస్తున్నప్పుడు గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఇక బాలయ్య గురించి చెప్పాలంటే ఆయనే అద్భుతం. మేము మంచులో నాలుగు ఐదు కోట్లు వేసుకొని షూటింగ్ కి వెళ్లే వాళ్ళం. కానీ.. ఆయన మాత్రం ఆ రోల్ కు తగ్గట్టు స్లీవ్ లెస్ లో మంచులో నిలబడి అద్భుతంగా యాక్షన్ చేశారు. పాత్రలో అంతగా లీనమై నటించారు. ఓ పాత్ర కోసం ప్రాణం పెట్టే నటుడు మన ఇండస్ట్రీలో ఉండడం గర్వకారణం.

ఈ సినిమా చూసిన తర్వాత బాలయ్య తప్ప ఇంకెవరు ఈ సినిమాలో నటించలేరని ఫీల్ అందరికీ కలుగుతుంది అంటూ చెప్పుకొచ్చారు. సెట్స్‌లో ఆయ‌న‌ను చూస్తే ఒక పాజిటీవ్ స్ట్రెంగ్త్ చూసిన ఫీల్ మాకు కలిగింది. ఆయన కూడా ఫ్యాన్స్ కు రియల్ గా కనిపించాలి.. వాళ్లను అలరించాలని తపనతోనే ప్రతి షార్ట్ ను కష్టపడి చేస్తాడు.. ఇందులో 99 శాతం ఆయన చేసినవే. ఎందుకంటే ఈ క్యారెక్టర్ అలాంటిది. ఆయన చేయాలి కానీ.. డూప్ కు అవకాశం ఉండదు.. సినిమా అంటేనే రకరకాల యాక్షన్ ఫార్మాట్ మారుతూ ఉంటాయి. ఈ ఫీల్డ్ లో ప్రతి నిమిషం మనం కూడా అప్డేట్ అవ్వాలి.. ఇక ఫైనల్ గా మనదేశమే కాదు.. ప్రపంచ దేశాలు కూడా శివుడి శక్తి ఎంత అద్భుతంగా ఉంటుందని గర్వపడేలా సినిమా ఉండబోతుంతి.. అందరూ థియేటర్లకు వచ్చి సినిమాను వీక్షించండి అంటూ వివరించారు. ప్రస్తుతం ఈ బ్రదర్స్ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.