టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో అఖండ 2 చేస్తూ.. ప్రస్తుతం బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అఖండ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్ గా రూపొందుతున్న సినిమా కావడం.. బోయపాటి శ్రీను, బాలయ్య బ్లాక్ బస్టర్ కాంబోలో తెరకెక్కనున్న నాలుగో సినిమా కావడంతో.. సినిమాపై ఆడియన్స్‌లో మొదటి నుంచి మంచి అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టే.. ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, లుక్స్.. ప్రతి ఒక్కటి ఆడియన్స్ లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి.

ఈ సినిమాపై హైప్ డబల్ చేశాయి. ఇక.. ఈ సినిమా ను డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. దీంతో ఫ్యాన్స్ సైతం.. సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తే బాగుండని.. ఫస్ట్ సింగిల్ కోసం ఎప్పటినుంచో కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. ఫస్ట్ ప్రోమో తాండవం గూస్ బంన్స్ తెప్పించేలా రూపొందించారు.

అఖండ.. హిమాలయాల్లో శివాలయాలు నడుమ ఒంటినిండా విభూదితో.. రౌద్రమైన కళ్ళతో.. ఢమరుకం చేతబట్టి సాక్షాత్ పరదశివుడే నేలకు వచ్చి తాండవం చేస్తున్నాడా అనంతల పర్ఫామెన్స్ అదరగొట్టాడు. అఘోరా లుక్ లో బాలయ్య నెక్స్ట్ లెవెల్ లో ఆకట్టుకున్నాడు. బాలయ్య జోష్ కు తగ్గట్టుగా.. థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పిస్తుంది. ఈ పాటను శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్‌లు ఆలపించగా.. కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని లిరిక్స్ అందించడంతో.. పూర్తి లిరికల్ సాంగ్ రిలీజ్ చేస్తే ఆడియన్స్‌లో ఏ రేంజ్లో రెస్పాన్స్ వస్తుందో వేచి చూడాలి. ఇక ఈ ఫుల్ లిరికల్ సాంగ్ ఈనెల 14న రిలీజ్ చేయనున్నారు టీం.

