టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు వారసురాలు మంచు లక్ష్మికి ఆడియన్స్ లో పరిచయాలు అవసరం లేదు. చివరిగా దక్ష సినిమాతో ఆడియన్స్ను పలకరించిన ఈ అమ్మడు తాజాగా.. హాటర్ ఫ్లై ఇంటర్వ్యూలో సందడి చేసింది. ఇక ఈ ఇంటర్వ్యూలో ఆమె తన లైఫ్ లో జరిగిన చేదు సంఘటన గురించి షేర్ చేసుకుంది. ప్రస్తుతం తను చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. మంచు లక్ష్మి మాట్లాడుతూ.. నాకు 15 ఏళ్ళ వయసులో నేను టెన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు.. కార్ లోనే స్కూల్ కి వెళ్ళలేదని. నా వెంట మా అమ్మ ,డ్రైవర్, బాడీగార్డ్స్ వచ్చేవాళ్ళు. ఓసారి స్కూల్ వాళ్ళు మమ్మల్ని హాల్ టికెట్స్ కోసం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో బయటకు తీసుకెళ్లారు అప్పుడు నేను చాలా ఎక్సైట్ అయ్యా అంటూ వివరించింది.
కానీ.. దారిలో ఒక వ్యక్తి నన్ను చాలా అసభ్యంగా టచ్ చేశాడు. ఏడుపొచ్చేసింది. అసలు నేను చిన్నపిల్లనని అతనికి తెలుసా.. లేదా.. అనే అనుమానం వచ్చింది. స్కూల్ కి వెళ్ళాక ఫ్రెండ్స్ తో ఇదే విషయం చెప్పా. వాళ్ళు తరచూ ఇలాంటి సంఘటనలు ఎదుర్కొంటున్నామని అనేసరికి షాక్ అయ్యా. ఇక్కడ నేను మోహన్ బాబు కూతురుని స్పెషల్ గా నన్నేం పక్కన పెట్టరు. ఇలాంటి చేదు అనుభవాలు అందరూ చూడాల్సిందే. కానీ.. చాలామంది అలాంటి అనుభవాలు ఎదురవలేదని అబద్ధాలు చెప్తారు.
ఇక మీటూ ఉద్యమం టైంలో అయితే నేను బోరున ఏడ్చిన రోజులు ఉన్నాయి. మీటు టైంలో.. ఆడవాళ్లు ఎదుర్కొన్న ఎన్నో బాధలకు.. నేను ఫేస్ చేసిన వాటిని తలుచుకొని కుమిలి కుమిలి ఏడ్చేదాన్ని. అంతేకాదు.. నేను పెద్ద కుటుంబం నుంచి వచ్చానని తెలుసుకుని మరీ కావాలనే కొందరు ఇబ్బందులు పెట్టారు. కారణం అందరిలా మేము బయటకు వచ్చి అన్ని రివీల్ చేయలేం. ఒకసారి మా ఇంట్లో దొంగతనం జరిగింది. అది నేను బయటకు చెప్పలేకపోయా. రూ.15,000 కదా పోనీలే అని వదిలేసాం. ఇంట్లో మమ్మల్ని అలా పెంచారు అంటూ మంచు లక్ష్మీ వివరించింది. ప్రస్తుతం మంచు లక్ష్మి చేసిన కామెంట్స్ వైరల్గా మారుతున్నాయి.



