వెంకీ vs బాలయ్య vs పవన్ ముగ్గురిలో ఈ ఏడాది బాక్సాఫీస్ కింగ్ ఎవరంటే..?

ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ పూర్తిగా మారిపోయింది. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు అన్ని సినిమాల లెక్కలు మారిపోయాయి. ప్రతి సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసి భారీ సక్సెస్ కొట్టాలని మేకర్స్ కష్టపడుతున్నారు. ముఖ్యంగా.. స్టార్ హీరోలు సినిమాలైతే పాన్ ఇండియా లెవెల్ ఆడియన్స్‌ను ఆక‌ట్టుకుంటూ విశేషమైన ఆదరణను దక్కించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే.. ఇప్పటికే టాలీవుడ్‌లో ఎంతో మంది స్టార్ హీరోస్ పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తూ తమదైన స్టైల్ లో ఆడియన్స్ను ఆకట్టుకుంటున్నారు. ముందు ముందు మరిన్ని కొత్త కథలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

This Time....Sure Shot...Blockbuster.... Sankranti ki Vasthunnam...koduthunnam.... 2025 loading....with a banger #SankranthikiVasthunam @anilravipudi @meenakshichaudhary006 @aishwaryarajessh #DilRaju #Shirish @ceciroleobheems @s.krishna001 #SameerReddy ...

ఇక ఈ ఏడాది 2025 సినిమాల విషయానికొస్తే.. ఇప్పటికే మన స్టార్ హీరోల అడపా దడపా సినిమాలు రిలీజై బాక్సాఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్ ని ద‌క్కించుకున్నాయి. అలా.. ఈ ఏడాది మొదట్లోనే విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బాక్స్ ఆఫీస్ ను బ్లాస్ట్ చేశాడు. రూ.300 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్లు పగలగొట్టిన సినిమాక రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇక ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన ఓజి సినిమా ఏకంగా రూ.350 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టింది. కాగా.. నందమూరి నటసింహం బాలకృష్ణ ఈ ఏడది మొదట్లో డాకు మహారాజ్‌తో ఆడియన్స్‌ను పలకరించినా.. ఊహించిన రేంజ్‌లో సక్సెస్‌ను అందుకోలేకపోయారు.

Pawan Kalyan vs Balakrishna: Dasara 2025 Gears Up for High-Stakes Cinematic Battle

ఈ క్రమంలోనే రూ.126 కోట్ల కలెక్షన్లతో సరిపెట్టుకున్నారు. ఇక ఆయన నుంచి నవంబర్‌లో అఖండ 2 తాండవం రాబోతుంది. ఈ సినిమాతో మాత్రం ఖచ్చితంగా బాలయ్య రూ.400 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఇప్పటివరకు వచ్చిన సినిమాల రిజల్ట్ బట్టి మాత్రం.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ భాస్కర్ కొట్టి విన్నర్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే ఈ ఏడాది బాక్సాఫీస్ బ్లాస్ట్‌ చేసిన హీరోగా పవన్, బాలయ్య మధ్య భారీ పోటీ నడుస్తుంది. వీళ్ళిద్దరిలో ఇయర్ ఎండింగ్ ఎవరు విన్నార్‌గా నిలుస్తారో చూడాలి.