ఆ బాలీవుడ్ స్టార్ ముద్దుగుమ్మల బాటలో రష్మిక.. నయా హిస్టరీ క్రియేట్ చేస్తుందా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా తిరుగులేని ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న రష్మిక మందన.. ప్రస్తుతం నేషనల్ క్ర‌ష్‌గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కేవలం సౌత్‌లోనే కాదు.. నార్త్‌లోను తన సత్తా చాటుకుంటూ దూసుకుపోతుంది. ఈ క్ర‌మంలోనే ఈ బెంగళూరు సోయ‌గం.. తన సినీ కెరీర్ విషయంలో.. ఆ ఇద్దరు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల జాడలోనే అడుగులు వేస్తుందంటూ ఓ టాక్ వైర‌ల్‌గా మారుతుంది. ఇంతకీ.. ఆ ముద్దుగుమ్మలు మరెవరో కాదు.. ఐశ్వర్యరాయ్, దీపిక పదుకొనే. సౌత్ నుంచి బాలీవుడ్‌లో అడుగుపెట్టిన హీరోయిన్ల లిస్టులో వీళ్ళిద్దరూ కూడా ఉంటారు. ఈ క్రమంలోనే.. వీళ్ళు బెంగళూరు నుంచి నార్త్ కు వెళ్లి బాలీవుడ్ ఇండస్ట్రీల తమ సత్తా చాటుకున్నారు. దేశవ్యాప్తంగా ఇమేజ్ సొంతం చేస్తున్నారు. ఇప్పుడు ఇదే రూట్‌లో.. రష్మిక మందన కూడా తనదైన ఇమేజ్ను క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది.

Aishwarya Rai Bachchan | Biography, Films, Cannes, Family, Daughter, Miss  World, & Facts | Britannica

మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకున్న ఐశ్వర్యరాయ్‌కి.. సినీ ఇండస్ట్రీ పెద్ద ఇబ్బంది కాలేదు. ఇరువార్ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఔర్ ప్యార్ హూ గయా తో బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. జీన్స్ తో తమిళ్లోను సంచలనం సృష్టించింది. తర్వాత బాలీవుడ్ లో వరుస అవకాశాలను దక్కించుకుంటూ మంచి సక్సెస్ లు సొంతం చేస్తుంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా మారిపోయింది. తర్వాత అభిషేక్ బచ్చన్ వివాహం చేసుకొని హిందీ ఇండస్ట్రీలో స్థిరపడింది. ఇక.. దీపిక సైతం మొదట కన్నడ ఇండస్ట్రీలో తన కెరీర్‌ను ప్రారంభించింది. ఓం శాంతి ఓంతో షారుక్‌ జోడిగా.. బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో ఆల్ టైం బ్లాక్ బస్టర్‌ను సాధించి.. వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా దూసుకుపోయింది. స్టార్ హీరోలతో వరుస‌ సినిమాలు చేసే అవకాశాలను కొట్టేసింది. ఇప్పటికీ.. బాలీవుడ్ నెంబర్‌వ‌న్ హీరోయిన్‌గా దీపిక తిరుగులేని సక్సెస్‌తో దూసుకుపోతుంది.

Deepika Padukone | Life, Movies, Awards, & Biography | Britannica

ఇక.. ఇద్దరు ముద్దుగుమ్మల తర్వాత బెంగళూరు నుంచి బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ రష్మిక మందన. మొదట రష్మిక సైతం కన్నడ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత టాలీవుడ్ లో అడుగుపెట్టి రికార్డ్ లెవెల్ లో సక్సెస్‌లు అందుకుంది. అతి తక్కువ సమయంలోనే నేషనల్ క్ర‌ష్ ఇమేజ్‌ సొంతం చేసుకుంది. కేవలం టాలీవుడ్ సినిమాలతోనే పాన్ ఇండియా లెవెల్ పాపులారిటీ దక్కించుకుని బాలీవుడ్‌లో సైతం అవ‌కాశాలు కొట్టేస్తుంది. మొదట గుడ్ బై, మిషన్ మజ్ను సినిమాలతో పెద్దగా ఇంపాక్ట్ చూప‌లేకపోయినా.. చాలా గ్యాప్ తర్వాత యానిమల్‌తో సక్సెస్ అందుకుంది.

Rashmika Mandanna reveals acting was never part of her original plan | Hindi  Movie News - Times of India

ఇక ఈ సినిమా తర్వాత.. వెంటనే మరో బాలీవుడ్ మూవీ ఛావతో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుంది. అయితే.. ఈ రెండు సినిమాల తర్వాత సికిందర్ సినిమాతో హ్యాట్రిక్ కొడుతుందని అంత భావించారు. కానీ.. ఈ సినిమా ఫ్లాప్ గా మిగిలిపోయింది. అయినా రష్మిక క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. ఈ క్రమంలోనే ఫస్ట్ జనరేషన్ బాలీవుడ్ ను ఏలిన హీరోయిన్ల లిస్టులో ఐశ్వర్యరాయ్.. తర్వాత జనరేషన్ లో దీపిక పదుకొనే.. నెక్స్ట్ జనరేషన్ లో రష్మిక మందన అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజెంట్ రష్మికకు ఉన్న క్రేజ్ రిత్య బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం అమ్మడితో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. మొత్తానికి బెంగళూరు నుంచి వచ్చిన ఈ సోయగం సైతం ఆ ఇద్దరు పాన్ ఇండియన్ స్టార్ హీరోయిన్లను ఫాలో అవుతూ బాలీవుడ్ ను షేక్‌ చేసే పనిలో బిజీగా ఉంది.