పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఓజీ మూవీ లాంటి సెన్సేషన్‌ను క్రియేట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ క్రమంలోనే మాస్, యాక్షన్, స్టైల్, డైలాగ్, మ్యూజిక్ ఇలా సినిమాకు అన్ని ప్లస్‌లుగా మారాయి. ఇక దసరా సెలవులు కూడా కలిసి రావడంతో సినిమాను సాధారణ ఆడియన్స్ సైతం తెగ ఎంజాయ్ చేశారు. అంత కాదు పవర్ స్టార్ రాకింగ్ రిటర్న్స్ అంటూ ట్యాగ్‌ను తెగ వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా బడ్జెట్ ఫ్రీ రిలీజ్ బిజినెస్, ప్రీమియర్ తొలి రోజు కలెక్షన్స్, పదవ రోజు ఏ రేంజ్‌లో కలెక్షన్లు కొల్లగొట్టిందని డీటెయిల్స్ వైరల్ గా మారుతున్నాయి.
పవన్ కళ్యాణ్ లోని హైయెస్ట్ బడ్జెట్ మూవీలో ఓజీ రూపొందింది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌ను డివీంఈ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ప్రొడ్యూసర్ గా రూపొందించారు. దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్‌కు ముందే ఆడియన్స్లో మంచి అంచనాలను నెలకొల్పింది. ఈ క్రమంలోనే.. ఫ్రీ రిలీజ్ బిజినెస్ అదరగొట్టింది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడుపోయాయి. ఆంధ్రప్రదేశ్‌లో రూ.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 22 కోట్లు, నైజాంలో రూ. 55 కోట్లకు హక్కులు అమ్ముడుపోయాయి. ఇలా.. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు రూ. 157 కోట్ల బిజినెస్ జరుపుకున్న ఓజీ.. ఇతర ప్రాంతాల్లో సైతం భారీ లెవెల్లో బిజినెస్ జరుపుకోవడం విశేషం. కర్ణాటకలో.. రూ. 8 కోట్లు. తమిళనాడు, కేరళకు రూ. 3కోట్లు, ఓవర్సీస్ లో రూ.25.5 కోట్లకు రైట్స్ అమ్ముడుపోయాయి.
ఇలా.. మొత్తం కలిపి రూ.194 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఓజీ.. బ్రేక్ ఈవెన్‌కు రూ.200 కోట్ల షేర్వసూలను కొల్లగొట్టాల్సి ఉంది. అంటే.. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా గ్రాస్ కలెక్షన్లతో రూ.400 కోట్లకు పైగా రాబట్టాలి. ఈ క్రమంలోనే.. సినిమా తొమ్మిది రోజుల్లో రూ.175 కోట్ల కలెక్షన్లను సొంతం చేసుకుంది. అయితే.. తాజాగా 10 వ రోజు కలెక్షన్స్ వైరల్ గా మారుతున్నాయి. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఓజీ 10వ రోజున సైతం అదే జోరుని చూపించింది. అని తెలుగు రాష్ట్రాల్లో.. ఇతర భాషల్లో.. అన్నింటిలో కలిపి రూ.5 కోట్లు వరకు బిజినెస్ జరగగా.. వరల్డ్ వైడ్‌గా రూ.6 కోట్ల వసూళ్లు సొంతమైనట్లు టాక్. దీంతో ఓజీ 10 రోజుల్లో రూ.179.5 కోట్ల నెటింట వసూళ్లను సొంతం చేసుకుంది. అలాగే.. ఓవర్సీస్‌లో ఓజీ కలెక్షన్స్ దుమ్ము రేపుతున్నాయి. కాగా మొత్తం గా ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్ల వసూళ్లను కొల్లగొట్టి.. ఓజీ పవన్ కెరీర్‌లోనే భారీ మైల్డ్ స్టోన్ గా నిలవనుంది.