సినీ ఇండస్ట్రీ నుంచి.. ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే.. టికెట్ కొనుగోలు చేయడానికి ముందుగా ప్రజలకు గుర్తుకొస్తున్న ఆప్షన్ ఆన్లైన్ బుకింగ్. ఇక.. ఆన్లైన్ బుకింగ్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవడం చాలా సులువు అయిపోయింది. ఇలాంటి క్రమంలో.. బుక్ మై షో లాంటి బిగ్గెస్ట్ ప్లాట్ఫార్మ్‌లో ఆన్లైన్ బుకింగ్ ఓపెన్ చేసిన తర్వాత దాదాపు చాలా థియేటర్లలో ముందే కొన్ని వరుసల సీట్లు సోల్డ్ అవుట్ అయిపోయినట్లు కనిపిస్తూ ఉంటుంది. కానీ.. ఆ సీట్లు నిజానికి అమ్ముడుపోవని నిర్మాతలు లేదా హీరోలు కార్పొరేట్ బుకింగ్ పేరుతో ముందుగానే బుక్ చేసేసుకొని సినిమాపై హైప్ క్రియేట్ చేసి చాలా బాగా నడుస్తుందని ఇమేజ్ను క్రియేట్ చేస్తున్నారంటూ టాక్.
ఎంతలా కష్టపడి హైప్ పెంచిన అసలు రివ్యూలు ప్రేక్షకులకు చేరతాయి. ఈ క్రమంలోనూ సెల్ఫ్ బుకింగ్ తో ప్రజలను మోసం చేయడానికి మేకర్స్ టైం వృధా చేసుకుంటున్నారని.. తాజా బాలీవుడ్ అగ్ర నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. కరణ్ జోహార్ మాట్లాడుతూ.. కార్పొరేట్ బుకింగ్ మరియు.. ప్రీ సెల్ బుకింగ్‌లు చెత్త పద్ధతిగా మారిపోయాయని.. ఇలా చేస్తే సినిమా నిజంగా హిట్ కాదని.. తాత్కాలికంగా టికెట్ సేల్స్ పెరిగినా.. సినిమాను మాత్రం నష్టంలో పడేయక తప్పదని కామెంట్స్ చేశాడు.
నిర్మాతలు తమ సొంత ఖర్చులతో టికెట్లు కొనడం వృధా.. ఇలా చేయడం వల్ల ఇండస్ట్రీ మొత్తానికే చెడ్డ పేరు వచ్చేస్తుందంటూ ఆయన వెల్లడించాడు. ఒక మూవీ సక్సెస్ కావాలంటే.. కంటెంట్ కచ్చితంగా ఆకట్టుకోవాలి.. లేకపోతే ఎన్ని విధాలుగా ప్రయత్నించినా సినిమా నిజమైన రివ్యూ మాత్రం కచ్చితంగా ఆడియన్స్ వరకు చేరుతుంది. ఇలా చేయడం వల్ల నిర్మాతలకు ఆర్థిక నష్టం తప్పించి మరొకటి ఉండదంటూ వివరించాడు. ప్రస్తుతం కరణ్ జోహార్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.