బామ్మరిది పెళ్లికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన తారక్.. అదేంటంటే..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బామ్మర్ది.. లక్ష్మీ ప్రణతి తమ్ముడు నార్నే నితిన్ పెళ్లి వేడుకలు ఇటీవల గ్రాండ్ లెవెల్ లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లి వేడుకనంతా తారక్ దగ్గర ఉండి చూసుకోవడం విశేషం. ఇక.. ఈ వేడుకలకు ఇరు కుటుంబాల బంధుమిత్రులతో పాటు.. సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు సైతం హాజరై సందడి చేశారు. ఈ క్రమంలోనే.. నితిన్ పెళ్లికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.

Jr NTR's brother-in-law Narne Nithiin marries Lakshmi Shivani Talkuri. A  look at her education qualifications and career - The Economic Times

బామర్ది పెళ్లిలో ఎన్టీఆర్ చేసిన సందడి.. ఎంతో ఆనందంతో ఆయన అతిధులను పలకరిస్తున్న ప్రతి ఒక్క చిన్న మూమెంట్ తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా.. తన బామ్మర్ది పెళ్ళికి ఎన్టీఆర్ ఏం గిఫ్ట్ ఇచ్చి ఉంటాడో తెలుసుకోవాలని ఆసక్తి కచ్చితంగా అందరిలోనూ ఉంటుంది. అయితే.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. బామర్ది నితిన్ కోసం ఎన్టీఆర్ ఒక కాస్ట్లీ కార్‌ను గిఫ్ట్ గా ఇచ్చాడట.

Nrane Nithin New Movie : ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ కొత్త సినిమా  ఓపెనింగ్..

అంతేకాదు.. తన సినీ కెరీర్‌కు ఉపయోగపడేలా ఓ మాస్టర్ ప్లాన్ చేశాడ‌ట‌. బామ్మర్ది కోసం స్టార్ డైరెక్టర్‌ను అప్రోచే అయ్యి అద్భుతమైన కథను సిద్ధం చేయించినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే.. డైరెక్టర్ ఎవరో కూడా తెలియకుండా సస్పెన్స్ లో ఉంచిన తారక్‌.. నితిన్ కు బిగ్ సర్ప్రైజ్ ను ప్లాన్ చేశాడట. ఇప్పుడు పెళ్లి అయిపోయింది కనుక.. మరో కొద్ది రోజుల్లోనే ఈ సస్పెన్స్‌కు తెర‌దించుతూ.. స్టార్ డైరెక్టర్ తో ఆ బడా ప్రాజెక్టు అనౌన్స్మెంట్ చేయనున్నారట.