మన శంకర వరప్రసాద్ వర్సెస్ అఖండ 2 బిజినెస్ డీటెయిల్స్.. ఎవరి బలం ఎంత..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు పెద్ద పండుగలు మొదలవుతున్నాయి. అందులో ఒకటి నందమూరి నట‌సింహం అఖండ 2, మ‌రొక‌టి.. మెగాస్టార్ చిరంజీవి మ‌న శంక‌ర వ‌ర ప్రసాద్ గారు. ఈ రెండు సినిమాల మధ్యన బిజినెస్ పరంగా ఇప్పుడు స్ట్రాంగ్ పోటి నెలకొంది. ఇక.. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. మన శంకర వరప్రసాద్ గారు సంక్రాంతి బరిలో రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేక‌ర్స్‌ ప్రకటించారు. అయితే.. రిలీజ్ డేట్ పై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. కాగా 2 వేరుదేరు పండుగలకు వస్తున్నా ఈ సినిమాల థియేట్రికల్ బిజినెస్ లెక్కలు హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్నాయి. ఈ రెండు సినిమాల్లో.. ఏ సినిమాకు డిమాండ్ ఎక్కువ ఉంది.. ఏ సినిమా ఎక్కువ బిజినెస్ ను జరుపుకుంటుందని ఆసక్తి అందరిలోనూ మొదలైంది.

Mana Shankara Varaprasad Garu Poster : r/tollywood

డిసెంబర్ 5న అఖండ‌, సంక్రాంతికి వస్తున్న మన శంకర వరప్రసాద్ గారు.. రెండు సినిమాలు రిలీజ్ డేట్ అడ్వాంటేజ్‌గా వాడుకోనున్నాయట. అక్కడ.. డిసెంబర్ మొదటి వారం కావడంతో సింగిల్ రిలీజ్ అడ్వాంటేజ్ యూజ్‌చేసుకుని.. మంచి కలెక్షన్లు కొల్లగొట్టేలా టీం ప్లాన్ చేస్తున్నారు. చిరంజీవి సినిమాకు సంక్రాంతి పండుగ బిగ్ అడ్వాంటేజ్ కావడంతో.. ఈ రెండు కాంబినేషన్ల పైన ఆడియన్స్ కు, డిస్ట్రిబ్యూటర్లకు మంచి నమ్మకం ఏర్పడింది. ఈ క్రమంలోనే.. రెండు సినిమాలకు భారీ లెవెల్లో బిజినెస్ జరగనుందని సమాచారం. దాదాపు రూ.63 కోట్ల వరకు బిజినెస్ జరగొచ్చని.. నైజాం ప్రాంతంలో రూ.45 కోట్ల వరకు బిజినెస్ జరుపుకోనున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి సీజన్‌కు అనీల్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైన‌ర్ మెగాస్టార్ స్టాంప్ తో తెరకెక్కడంతో.. ఆంధ్రాలో సినిమాపై మరింత బజ్ నెలకొంది.

Nandamuri Balakrishna's Akhanda 2 all set for wrap up; to hit the screens  on September 25

ఇక బాలకృష్ణ అఖండ 2 తాండవం బిజినెస్ అంచనాలు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. అఖండ‌ మొదటి భాగం బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టడంతో.. ఆంధ్రలో సినిమాకు రూ.54 కోట్ల మేర.. నైజం లో రూ.36 కోట్ల మేరా బిజినెస్ జరగనున్నట్లు అంచనాలు వేస్తున్నారు. ఇక అఖండను మించి పోయే రేంజ్ లో అకండ 2 ఉందని ఇప్పటికే మేకర్స్ చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమాపై అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి. బిజినెస్ కూడా మరింత పెరిగే అవకాశం ఉందట. రేషియో ప్రకారం ప్రస్తుతం అఖండ 2 కంటే మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు ఎక్కువ డిమాండ్ ఉందని తెలుస్తుంది. ఇక ముందు ముందు ఈ రెండు సినిమాలు రిలీజ్ డేట్‌ను ఎలా అడ్వాంటేజ్‌గా మార్చుకుంటాయో.. ఏ రేంజ్ లో బిజినెస్‌తో రికార్డులు క్రియేట్ చేస్తాయో.. సినిమా బలం ఎంతో చూడాలి.