ఓజీ క్రేజి రికార్డ్.. ఇది పవన్ కళ్యాణ్ లోని మొదటిసారి..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. సుజిత్ డైరెక్షన్‌లో తెర‌కెక్కిన లేటెస్ట్ మూవీ ఓజీ. దసరా కానుకగా.. సెప్టెంబర్ 25న గ్రాండ్ లెవెల్‌లో రిలీజై సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ ను దక్కించుకున్న ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లతో రికార్డులు సృష్టిస్తుంది. ఈ క్రమంలోనే.. 9రోజుల్లో ఓజీ.. బాక్సాఫీస్ రన్ ఏ రేంజ్‌లో కొనసాగిందో తెలుసుకోవాలని ఆసక్తి అందరిలోనూ ఉంటుంది.

కాగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో 9వ‌ రోజు మంచి కలెక్షన్ దక్కించుకుందట‌. హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాల లిస్టులో ఓజీ కాస్త వెనకబడినా.. 9వ రోజు కలెక్షన్ల విషయంలో మాత్రం మంచి నెంబర్‌నే సొంతం చేస్తుంది. ఆర్‌ఆర్ఆర్ మూవీ 9వ రోజు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.19.62 కోట్లు కలెక్షన్లు కొల్లగొడితే.. బాహుబలి 2 సినిమా రూ.6.51 కోట్ల కలెక్షన్లను దక్కించుకుంది. సరిలేరు నీకెవరు మూవీ రూ.6.33 కోట్లు, బాహుబలి 1 సినిమా రూ.6.5 కోట్లు, హనుమాన్ సినిమా రూ.5.81 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టగా.. అలవైకుంఠపురంలో రూ.5.5 కోట్ల కలెక్షన్లు దక్కించుకుంది.

OG Movie 9 Days Collections Archives - OkTelugu

ఎఫ్2 సినిమా రూ.4.76 కోట్లు, వాల్తేరు వీరయ్య సినిమా రూ.4.66 కోట్లు, పుష్ప పార్ట్ 2.. రూ.4.34 కోట్లు కలెక్షన్ దక్కించుకోగా.. దేవర పార్ట్ 1 రూ.4.30 కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది. ఇక ఓజి సినిమా సైతం తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిదవ రోజున రూ.3.48 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇలా తెలుగు రాష్ట్రాల హైయెస్ట్‌ కలెక్షన్లు కల్లగొట్టిన సినిమాల లిస్టులో.. ఓజీ 11వ స్థానాన్ని దక్కించుకుంది. అయినా.. 9వ రోజు ఈ రేంజ్ కలెక్షన్స్‌తో పవన్ కెరీర్‌లోనే మొదటిసారి రికార్డ్ క్రియేట్ అయింది.