ప్రస్తుతం టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ మొదలైంది. చిన్న హీరోలు.. పెద్ద హీరోలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఊర మాస లుక్ లోకి మారిపోతున్నారు. రఫ్ అండ్ రగడ్ లుక్‌లో ఆడియన్స్‌ను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే.. ఇలా రఫ్ అండ్ రగడ్ లుక్‌లో నటించి పలువురు స్టార్ హీరోస్ హిట్స్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలోనే.. మిగతా హీరోలు సైతం ఇదే బాటలో జర్నీ మొదలుపెట్టారు. హిట్ కోసం అవసరమైతే ఎలాంటి పాత్రకైనా సిద్ధమేనని.. మరోసారి రుజువు చేస్తున్నారు. ఊర మాస నాటు లుక్ తో అందరిని ఆకట్టుకుంటున్నారు.
ఇక ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమాల్లో ఎన్టీఆర్ రఫ్ అండ్ రాగడ్ లుక్ లో కనిపించనున్నట్లు తాజాగా రివీల్ అయిపోయింది. కాంతార 1 ఈవెంట్‌లో ఎన్టీఆర్ లుక్ చూస్తే దానిపై క్లారిటీ వచ్చేస్తుంది. అలాగే.. అక్కినేని హీరోస్ ఎంత క్లాస్ గా ఉంటారో తెలిసిందే. వీళ్లకు అలాంటి రోల్సే వస్తాయి కానీ.. ఇటీవల కాలంలో అవి పెద్దగా సక్సెస్ కాకపోవడంతో వీళ్ళు కూడా.. మాస్ లోకి షిఫ్ట్ అయిపోయారు. అలా తాజాగా నాగచైతన్య తండేల్ సినిమాతో హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు.. అఖిల్ కూడా గుబురు గడ్డంతో ఊర మాస లుక్‌లో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. లెనిన్ సినిమాతో ఆయన రగడ్ లుక్‌లో మెరవనున్నాడు.
ఇక ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది సినిమాలో మాస్ లుక్‌తో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఇదే లుక్‌లో నటించినా రంగస్థలం ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే మరోసారి తన లుక్‌తో ఆకట్టుకుంటున్నాడు చరణ్. అంతేకాదు.. మరో మెగా హీరో సాయిధరమ్ తేజ్ బ్రో ఫ్లాప్ తర్వాత లాంగ్ గ్యాప్ ని తీసుకునే సంగతి తెలిసిందే. ఇక సంబరాల ఏటిగట్టు మూవీతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో తేజ సైతం గుర్తుపట్టలేనంతగా గుబురు గడ్డంతో.. రగడ్ లుక్ లో మెరిశాడు. అత్యంత భారీ బడ్జెట్‌లో ఈ సినిమా సక్సెస్ కొట్టాలని తేజ్.. తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం.. గెటప్ ఛేంజ్ మూవీస్‌కు గేమ్ ఛేంజర్‌గా మారుతుంది అంటూ టాక్ ఇండస్ట్రీలో తెగ వైరల్ గా మారుతుంది. మరి.. ఈ సినిమాలతో హీరోలు ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.