టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణకు ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే.. తాను తరికెక్కించిన ప్రతి సినిమాతోనూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటున్నారు. ఇక బాలయ్య నుంచి.. చివరగా వచ్చిన నాలుగు సినిమాలు వరుసగా హిట్లు సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం.. ఆఖండ 2 తో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా రావడంతో ఈ సినిమా పై ఆడియన్స్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.
ఈ క్రమంలోనే బాలయ్య.. అఖండ 2 తో మరోసారి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొల్లగొట్టి రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా.. బాలయ్య తన నెక్స్ట్ సినిమా గోపీచంద్ మల్లినేనితో చేయనున్న సంగతి తెలిసిందే. పిరియాడికల్ యాక్షన్ మూవీగా రూపొందనుంది. ఈ క్రమంలోనే బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ గా మారుతుంది. బాలయ్య నటవారసుడిగా మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తాడంటూ ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నా.. అవి మాత్రం ఇప్పటివరకు వర్కౌట్ కాలేదు.
అయితే.. బాలయ్య, గోపీచంద్ కాంబోలో వస్తున్న నెక్స్ట్ సినిమాలో మాత్రం మోక్షజ్ఞ ఎంట్రీ ఖచ్చితంగా ఉంటుందని.. ఈ సినిమాలో అద్భుతమైన క్యారెక్టర్ లో మోక్షజ్ఞ నటించబోతున్నాడు అంటూ టాక్ నడుస్తుంది. మోక్షజ్ఞను డైరెక్ట్ హీరోగా ఎంట్రీ ఇప్పించకుండా.. బాలయ్య సినిమాలో ఓ పవర్ఫుల్ రోల్‌లో ఇంట్రడ్యూస్ చేయనున్నాడట బాలయ్య. ఆ తర్వాత మోక్షజ్ఞ నటన పరిమితి ఏంటో తెలుస్తుందని.. ఓ స్టార్ డైరెక్టర్ చేతులమీదగా.. మోక్షజ్ఞను ఇండస్ట్రీకి పరిచయం చేయాలని బాలయ్య ప్లాన్ చేస్తున్నట్లు తెలిస్తుంది. మరి బాలయ్య, మోక్షజ్ఞ క్యారెక్టర్ ఎలా ఉండబోతున్నాయో.. మోక్షజ్ఞ ఈ మూవీతో ఎలాంటి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంటాడో చూడాలి.