ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ సినిమాలంటే తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం అయింది. ఈ క్రమంలోనే.. మిగతా ఇండస్ట్రీలు అన్ని.. తెలుగు ఇండస్ట్రీని చిన్నచూపు చూసేవి. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళు అయితే ఎప్పటికప్పుడు హెళన చేస్తూ.. కౌంటర్లు వేస్తూ తెలుగు సినిమాను కించపరుస్తూ ఉండేవాళ్ళు. అలాంటి టాలీవుడ్‌ను ఇప్పుడు.. బాలీవుడ్ కాదు.. మొత్తం పాన్ ఇండియాలో ప్రశంసలు దక్కించుకుంటుంది. తెలుగు సినిమా ఖ్యాతి అంతకంతకు పెరుగుతూ పోతుంది. ఈ క్రమంలోనే గతంలో తెలుగు సినిమాను విమర్శించిన ఇండస్ట్రీ స్టార్ హీరోలు సైతం.. మన తెలుగు దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చెబుతున్నారు. వీళ్లతో ఒక్క సినిమా చేస్తే చాలు ఇండస్ట్రీ హిట్ కొట్టేయచ్చని బాలీవుడ్ సైతం స్ట్రాంగ్ గా నమ్ముతుంది. కాగా.. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా లెవెల్‌లో ఎంతోమంది స్టార్ హీరోలు ఆడియన్స్‌ను పలకరిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే.. హైయెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోల్లో ప్రభాస్ మొదటి స్థానాన్ని దక్కించుకోగా.. అల్లు అర్జున్ రెండో స్థానంలో దూసుకుపోతున్నాడు. ప్రభాస ఇప్పటికే పాన్ ఇండియా సినిమాలతో బాలీవుడ్ లోను తన సత్తా చాటుకున్న సంగతి తెలిసిందే. అయితే అల్లు అర్జున్ సైతం పుష్ప 2 లాంటి సాలిడ్ సక్సెస్ అందుకొని.. బాలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే.. పాన్ ఇండియాలో హైయెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోలుగా ఇద్దరు సంచలనం సృష్టించారు. కాగా.. ఇద్దరినీ బీట్ చేయగల కెపాసిటీ ఉన్న ఏకైక టాలీవుడ్ హీరో రామ్ చరణ్ అంటూ ప్రజెంట్ సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్ ఆడియన్స్‌ను పలకరించి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ప్రజెంట్ బుచ్చిబాబు సన్న డైరెక్షన్‌లో పెద్ది సినిమా షూట్‌లో బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్‌లో అంచనాలు ఆకాశానికంటాయి. కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు.. ఇతర ఇండస్ట్రీల ఆడియన్స్ సైతం.. ఈ సినిమాపై ఆసక్తి చూపుతుండడం విశేషం. ఈ క్రమంలోనే సినిమా రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే.. కేవలం బ్లాక్ బస్టర్ గా నిలవడం కాదు.. యావత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే ప్రభాస్, అల్లు అర్జున్ పాన్ ఇండియన్ స్టార్ హీరోలుగా మంచి పొజిషన్లో రాణిస్తున్న క్రమంలో వాళ్లను కూడా బీట్ చేసి నెంబర్ 1 పొజిషన్‌లో దక్కించుకోగల సత్తా చరణ్ కి మాత్రమే ఉందని.. ధీమా వ్యక్తం చేస్తున్నారు.