నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ జోష్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చివరిగా.. తను నటించిన నాలుగు సినిమాలతో సూపర్ హిట్‌లు అందుకున్న బాలయ్య.. ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో అకండక్టు తాండవంతో ఆడియన్స్ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు అక్కడ ఇలాంటి బ్లాక్ బస్టర్ కు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతున్న నేపథ్యంలో సినిమా పై ఆడియో సినిమాతో మరోసారి బాలయ్య బ్లాక్ పాస్టర్ గాయం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు మరో సినిమాకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్నాడు. ఎన్బికె 111 రన్నింగ్ టైటిల్ తో రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ప్రస్తుతం తెగ వైరల్ గా మారుతుంది.
ఈనెల 24న సినిమాకు సంబంధించిన పూజ కార్యక్రమాలు గ్రాండ్ లెవెల్ లో జరగనున్నాయని సమాచారం. అంతేకాదు.. వచ్చే దాదాపు అఖండ పనులన్నీ ఈ నెలలో కంప్లీట్ చేసుకుని.. వచ్చే నెల మొదటివారం నుంచి బాలయ్య ఎన్బికె 111 రెగ్యులర్ షూటింగ్లో పాల్గొన్ననున్నాడట. గతంలో వీర సింహారెడ్డి ఎలాంటి బ్లాక్ బస్టర్ అందుకుందో తెలిసిందే. ఈ క్రమంలోనే.. మరోసారి వీళ్లిద్దరు కాంబోలో వస్తున్న సినిమా కావడంతో.. ఆడియన్స్‌లోను మంచి హైప్ మొదలైంది. ఇక.. ఆడియన్స్‌లో ఉండే అంచనాలకు తగ్గట్టుగానే.. సినిమాను ఓ వైవిధ్యమైన కథతో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
రెండు టైమ్ డైమెన్షన్స్‌తో ఈ సినిమా నడుస్తుందని సమాచారం. ప్రస్తుత కాలంలో.. కథ ప్రారంభమై సెకండ్ హాఫ్ లో కొత్త టర్న్ తీసుకుంటుందని.. వందల ఏళ్ళ కాలం నాటి గతానికి కథ వెళ్తుందట. ఇంతకీ.. ప్రజెంట్ కాలానికి, పాస్ట్ కాలానికి మధ్య సంబంధం ఏంటి.. అనే కంటెంట్ ఆసక్తిగా చూపించనున్నాడట.. మల్లినేని. ఇక.. బాలకృష్ణ ఇందులో మాఫియా డాన్‌గా, అలాగే రాజుల కాలంనాటి యోధుడిగా.. డిఫరెంట్ రోల్స్ ప్లే చేయనున్నాడట. ఇక.. బాలయ్య మార్క్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో.. సెకండ్ హాఫ్ అంత ఆడియన్స్‌కు నచ్చేలా స్టోరీని డిజైన్ చేసినట్లు సమాచారం. అంతేకాదు.. డైలాగ్ వెర్షన్ మినహాయించి.. స్క్రిప్ట్ వర్క్ అంత ఇప్పటికే పూర్తి చేసేసారట టీం. ఈ సినిమాకు సంబంధించిన కాస్టింగ్ వివరాలు.. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను త్వరలోనే అఫీషియల్ గా ప్రకటించనున్నట్లు సమాచారం.