మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మన శంకర వరప్రసాద్ గారు సినిమా షూట్‌లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి రాకముందే ఆడియన్స్‌లో మంచి అంచనాలను నెలకొల్పింది. సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత అనీల్ రూపొందిస్తున్న సినిమా కావడం.. చిరంజీవి సినిమాలో హీరోగా నటిస్తూ ఉండడంతో ఆడియన్స్‌లో ఆశక్తి నెలకొంది. దానికి తగ్గట్టుగానే.. ఈ సినిమాలో వింటేజ్ చిరుని చూడబోతున్నామని.. చిరంజీవి కామెడీ టైమింగ్ తగ్గట్టు ఇటీవల కాలంలో సరైన సినిమా రాలేదు.. ఈ సినిమాతో ఆడియన్స్ కు అది దక్కుతుందంటూ అనిల్ రావిపూడి సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ అంతకంతకు పెంచేశాడు.
ఇలాంటి క్రమంలో.. సినిమా నుంచి ఫస్ట్ డ్యూయెట్ సాంగ్ రిలీజ్ చేశారు. మీసాల పిల్ల అంటూ సాగే.. ఈ సాంగ్ బీట్, ట్యూన్, లిరిక్స్.. చిరంజీవి నయనతార స్టైల్ అన్ని ఆడియన్స్ కు కనెక్ట్ అవుతున్నాయి. సాంగ్ మ్చి రెస్పాన్స్ దక్కించుకుంటుంది. కానీ.. కొన్నిచోట్ల మాత్రం సాంగ్ విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అన్ని రకాలుగా పర్ఫెక్ట్‌గా ఉన్నా కూడా.. సినిమా అసలు నెగెటివిటీ ఎదుర్కోవడానికి కారణం ఏంటి.. ఈ మిక్స్డ్ టాక్ ఎందుకు వస్తుంది అంటే మాత్రం అనిల్ రావిపూడి గత సినిమా సంక్రాంతికి వస్తున్నాం, గోదారి గట్టుమీద రామచిలకవే సాంగ్. ఈ సాంగ్ తో చిరు సాంగ్ కంపేర్ చేయడం. ఈ సాంగ్లో వెంకటేష్ లుంగీ తో, ఐశ్వర్య రాజేష్ చీరకట్టులో మిడిల్ క్లాస్ అమ్మాయిలా నోచ్యురల్‌గా అమాయకత్వంతో కనిపించారు. జనం టక్కున ఈ సినిమాలో వాళ్ళిద్దరి పాత్రలకు కనెక్ట్ అయిపోయారు.
కానీ.. మీసాలు పిల్ల మాత్రం ఈ సాంగ్‌కు పూర్తిగా కాంట్రాస్ట్ గా ఉంది. కథ కూడా డిఫరెంట్ గా ఉండబోతుందని ఆడియన్స్ కు సాంగ్స్ చూస్తుంటే అర్థమవుతుంది. చిరంజీవి, నయనతార ఈ సాంగ్‌లో గ్రేస్, స్టైల్‌తో యూనిక్‌గా అందరిని ఆకట్టుకునేలా ఉన్నా.. దాన్ని ప్రజెంట్ చేసిన తీరు మెప్పిస్తున్నా.. సాహిత్యం, బీట్.. 80,90ల కాలం పాటలను గుర్తు చేసేలా ఉంది. పాట ఆడియో ఫుల్ గా వైరల్ అవుతున్న.. ప్రోమో నుంచి సాంగ్ వచ్చేలోపు వందల కొద్ది రీల్స్ ఈ సాంగ్ పై రిలీజైనా.. చిరంజీవి 70 ఏళ్ల వయసులోనూ తన లుక్, గ్రేస్, డ్యాన్స్‌తో ఆకట్టుకుంటున్నా.. సినిమాకు నెగెటివిటీ వస్తుంది. దానికి కారణం.. ఈ జనరేషన్ ఆడియన్స్ అలోచనలు. సినిమాలలో అసలు డ్రామా కనిపించకూడదని ఫీలవుతారు. ఈ క్రమంలోనే సంక్రాంతికి వస్తున్నాం సాంగ్లో వెంకీ బాడీ లాంగ్వేజ్ కాస్త అమాయకత్వంగా కనిపిస్తోంది తప్ప.. ఎక్కడ డ్రామా ఉండదు. దీంతో ఆ సాంగ్ పాజిటివ్ వచ్చింది. చిరు.. మీసాల పిల్ల సాంగ్ మాత్రం కొంచెం నెగిటివిటి దక్కించుకుంది. దీనికి తోడు ఇటీవల కాలంలో మెగా హీరోలు రాజకీయాలు సినిమాల కారణంగా ఎన్నో ట్రోల్స్ ను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ట్రోలర్స్ మెగాస్టార్ ను కూడా టార్గెట్ చేస్తున్నారు. ఇక ఈ మిక్స్డ్ టాక్ సంగతి ఎలా ఉన్నా.. సాంగ్ మాత్రం రీల్స్, డ్యాన్స్‌లకు మంచి మెటీరియల్‌గా మిగులుతుంది. వందల్లో కాదు వేలల్లో ఈ సాంగ్ రీల్స్ కనిపిస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు.