NBK 111 పై బిగ్ అప్డేట్.. ఆ పండుకొని టార్గెట్ చేసిన బాలయ్య..

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలకృష్ణ.. అఖండ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌ సిక్కుల్‌గా అఖండ 2తో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అఖండ 2 డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న‌ట్లు మేకర్స్ ఇప్పటికే అఫీషియల్ ప్రకటన ఇచ్చేస్తారు. ఇక.. బాలయ్య నెక్స్ట్ సినిమాకు సంబంధించిన పనులు కూడా మొదలైపోయాయి. బాలయ్య 111వ సినిమాగా.. గోపీచంద్ మల్లినేని ఈ సినిమాను రూపొందించనున్నాడు. ఇక ఇప్పటికే బాలయ్య, గోపీచంద్ కాంబోలో వీర సింహారెడ్డి సినిమా వచ్చి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా.. బాలీవుడ్‌లో జాత్ సినిమా తీసి సూపర్ సక్సెస్ దక్కించుకున్నాడు గోపీచంద్. ఇలాంటి క్రమంలో బాలయ్య మరోసారి గోపీచంద్‌తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. ఆడియన్స్‌లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది.

బాలయ్య 111 సినిమాకు వృద్ధి సినిమా బ్యానర్ పై వెంకట సతీష్ కిల్లారు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించనున్నారు. అయితే.. సినిమాను మాస్‌ ఎంటర్టైనర్‌గా డిఫరెంట్ టేకింగ్‌తో చూపించనున్నారని.. అంతే కాదు సినిమాని కేవలం తెలుగులోనే కాకుండా.. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా ఫ్యాన్స్ కు ఫుల్ ఆఫ్ మాస్ ట్రీట్‌గా ఉండనుందని.. మరోసారి బ్లాక్ బస్టర్ కాయమంటూ టాక్ న‌డుస్తుంది. గోపిచంద్ కూడా ఈ సినిమా నుండి నేషనల్ లెవెల్లో ఆడియన్స్‌ను మెప్పించేలా డిజైన్ చేశాడట. అయితే.. సినిమాల్లో మిగతా కాస్ట్ అండ్ కృ ఎవరన్నది ఇంకా రివిల్ కాలేదు. కానీ.. సినిమా నెక్స్ట్ ఇయర్ ప్రారంభంలో షూటింగ్ మొదలుపెట్టి దసరాకి కంప్లీట్ చేసి రిలీజ్ చేసేలా టీం ప్లాన్ చేస్తున్నారట.

NBK 111: నందమూరి అభిమానులు హుషారెత్తే వార్త.. లైన్ లోకి బాలకృష్ణ మరో  పవర్‌ఫుల్ ప్రాజెక్ట్ | సినిమా - News18 తెలుగు

అలా.. అయితే డిసెంబర్లో అఖండ 2.. మళ్ళీ 9 నెలల గ్యాప్ లోనే బాలయ్య నుంచి మరో సినిమా వచ్చే అవకాశం ఉంది. ఇక బాలయ్య సైతం ఎన్బికే 111 సినిమాను చాలా స్పెషల్గా తీసుకున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాతో పాటు క్రిష్ డైరెక్షన్ లో ఆదిత్య 999 సినిమాను కూడా ఒకేసారి సెట్స్ మీదకు తీసుకురానున్నారట. ఈ క్రమంలోనే బాలయ్య ప్రజెంట్ సినిమా అఖండ 2తో పాటు.. ఫ్యూచర్ ప్రాజెక్టులపై కూడా ఆడియన్స్‌లో మంచి ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఈ సినిమాలతో.. బాలయ్య ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటారో.. డబల్ హ్యాట్రిక్ అందుకుంటాడో లేదో చూడాలి.