అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ కంప్లీట్.. పెళ్లికూతురు ఎవరంటే..?

టాలీవుడ్ మోస్ట్ పాపులర్ ఫ్యామిలీస్ లో అల్లు ఫ్యామిలీ కూడా ఒకటి. స్టార్ ప్రొడ్యూసర్ గా తిరుగులేని ఇమేజ్ను సంపాదించుకున్న అల్లు అరవింద్.. ఆయన వారసులు అల్లు అర్జున్, అల్లు శిరీష్ లకు ఎలాంటి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుకుంటున్నాడు. ఇక అల్లు శిరీష్ సైతం టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో నటించాడు. అయితే.. ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోకపోవడంతో సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. ప్రజెంట్ అల్లు ఫ్యామిలీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గాను అల్లు శిరీష్ కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఫ్యాన్స్ కు ఆయన ఓ గుడ్ న్యూస్ చెప్పాడు.

Allu Sirish Announces Engagement with Nayanika - Telugu360

త్వరలోనే అల్లు శిరీష ఓ ఇంటివాడు కాబోతున్నాడు అనే విషయాన్ని అఫీషియల్ గా వెల్లడించారు. నైనికా అనే అమ్మాయిని తన వివాహం చేసుకోబోతున్నట్లు అల్లు శిరీష్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు. ఆమె చేతిలో చేయి వేసి పట్టుకొని కలిసి నడుస్తున్న ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. అంతేకాదు నైనికా చేతివేళ్లకి ఉంగరం ఉన్న ఫోటోను శిరీష్ సోషల్ మీడియాలో పంచుకోవడం విశేషం. అయితే.. ఎప్పుడో వీళ్లిద్దరి మ్యాచ్ ఫిక్స్ అయిపోయిందట. అక్టోబర్ 31న వీళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయినా.. ఈ విషయాన్ని అల్లు ఫ్యామిలీ సీక్రెట్‌గా ఉంచారు.

Allu Sirish Set to Marry His Loved One After Personal and Professional  Struggles

అయితే.. తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియా పోస్ట్ ద్వారా శిరీష్ షేర్ చేసుకుంటూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చాడు. ఈరోజు మా తాత అల్లు రామలింగయ్య గారు బర్త్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటూ.. ఇదే మంచి తరుణంగా భావించి నా లైఫ్ కి సంబంధించిన ఓ ఇంపార్టెంట్ విషయాన్ని అందరితోనూ షేర్ చేసుకోవాలి అనుకుంటున్నా. అదే నైనికతో నా ఎంగేజ్మెంట్ విషయం. అక్టోబర్ 31న మా ఎంగేజ్మెంట్ జరిగింది. మా అమ్మమ్మ అల్లు నాగరత్నమ్మ ఇటీవల తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఎప్పుడు నా పెళ్లి చూడాలని ఆమె ఎంతగానో ఆరాటపడింది. ఇప్పుడు ఆ తరుణం వచ్చేసింది. నాకు తెలుసు ఆమె మా ఇద్దరికీ తన బ్లెస్సింగ్స్ అందిస్తూనే ఉంటుంది. ఇక మా కుటుంబంలో నైనికను ఆహ్వానించడానికి.. నా కుటుంబం కూడా చాలా ఆనందంగా ఉందంటూ నోట్ రాసుకోవచ్చాడు. ప్రస్తుతం శిరీష్ చేసిన ఈ పోస్ట్‌ వైరల్ గా మారుతుంది. అయితే ఇంతకీ పెళ్లి డేట్ ఎప్పుడో.. అస‌లు ఈ నైనిక ఎవ‌రు అనే విషయంపై గూగుల్లో సెర్చింగ్ లు మొదలు పెట్టేసారు ఫ్యాన్స్.