టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. నాగ అశ్విన్ డైరెక్షన్‌లో తెరకెక్కిన మూవీ కల్కి 2898 ఏడి. ఈ సినిమా గతేడాది రిలీజై బాక్సాఫీస్ బ్లాస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇంటర్నేషనల్ లెవెల్ లో ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈ సినిమా.. కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేకర్స్ దాన్ని అఫీషియల్‌గా వెల్లడించారు. రెండో పార్ట్‌లోని సగభాగం కూడా పూర్తయిపోయిందని.. మిగతా షూటింగ్ త్వరలోనే ప్రారంభిస్తామంటూ ఎప్పటికప్పుడు చెబుతూ వస్తున్నారు.
ఈ క్రమంలోనే.. సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారా అంటూ అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా దీనిపైన ఫోడ్ కాస్ట్‌లో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చాడు. కల్కి 2 షూటింగ్ చాలా అంశాలతో ముడిపడి ఉందంటూ వివరించిన ఆయన.. అందులో యాక్టర్స్ కాంబినేషన్స్ సీన్స్ అన్నీ చాలా ఉన్నాయి. వాళ్లందరికీ కుదిరినప్పుడే ఈ సినిమా షూట్ చేయగలుగుతాం.. యాక్షన్ సీన్స్ కూడా భారీ లెవెల్ లో ఉంటాయి.. వాటిని షూట్ చేయడానికి చాలా టైమే ఉందంటూ వివరించాడు.
దీని రిలీజ్ పై.. నా దగ్గర కచ్చితంగా సమాధానం అంటూ లేదని చెప్పుకోచాడు. ప్రస్తుతం కల్కిన నటించిన స్టార్స్ అందరూ చాలా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఏడాది చివర్లో మేము దాన్ని షూటింగ్ ప్రారంభించాలని భావిస్తున్నాం. షూటింగ్కు తక్కువ టైం పట్టినా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు మరింత సమయం పడతాయి. మరో రెండు సంవత్సరాల్లో దీన్ని రిలీజ్ చేసే ప్రయత్నాలు చేస్తా అంటూ వివరించాడు.