టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలతో బిజీ బిజీగా గడుపుతూనే సమయం దొరికినప్పుడల్లా సినిమాల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సైతం ఒకటి. హరీష్ శంకర్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలే ఉన్నాయి. గతంలో పవన్, హరీష్ కాంబోలో గబ్బర్ సింగ్ తెరకెక్కి ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసిందే. ఈ క్రమంలోనే మరోసారి గబ్బర్ సింగ్ తరహా వింటేజ్ పవన్ చూడాలని ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు.
ఇక రేపు సెప్టెంబర్ 2 పవన్ బర్త్డే సెలబ్రేషన్స్ లో భాగంగా టీం ఈ సినిమాకు సంబంధించిన ఫుల్ మీల్స్ ట్రీట్ అందించనున్నారు. దీన్ని అఫీషియల్ గా మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ద్వారా రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్ తో టోపీని పైకి లేపుతూ.. బ్లాక్ డ్రెస్ లో మెరిసిన ఈ పోస్టర్ ఆడియన్స్ లో ఆసక్తిని మరింత పెంచేసింది. ఇక ఈ పోస్టర్ తో పాటే.. మేకర్స్ ఈరోజు సాయంత్రం 4 గంటల 45 నిమిషాలకు పవన్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అంటూ షేర్ చేసుకున్నారు.
ఈ క్రమంలోనే ఫ్యాన్స్ సినిమా నుంచి ఏదో బిగ్ అప్డేట్ రానుదంటూ.. ఏదైనా పవర్ ఫుల్ టీజర్ ఆ.. లేదా సినిమా రిలీజ్ డేట్ పై మేకర్స్ క్లారిటీ ఇవ్వనున్నారేమో అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు టీం. ఇక అప్డేట్‌తో సినిమాపై ఏ రేంజ్ లో హైప్ క్రియేట్ అవుతుందో.. ఎలాంటి ఇమేజ్ అందుకుంటారో చూడాలి.