బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే.. OG కు టాలీవుడ్ సెలబ్రిటీల రివ్యూస్ ఇవే..

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సజిత్ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ఓజీ. పవన్ అభిమానులతో పాటు సాధర‌ణ ఆడియన్స్‌ సైతం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసిన ఈ సినిమా.. దసరా కానుకగా నేడు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. సెప్టెంబర్ 24 నిన్న రాత్రి నుంచి సినిమా ప్రీమియర్ షోస్ మొదలైపోయాయి. ఇక ఈరోజు పలు రెగ్యులర్ షోస్ సైతం ముగిశాయి. ఇప్పటికే సినిమా చూసిన ఆడియన్స్ నుంచి.. సినిమాపై పాజిటివ్ టాక్ వ‌స్తుంది. సాధర‌ణ ఆడియన్స్ కాదు స్టార్ సెలబ్రిటీస్ సినిమా చూసేందుకు థియేటర్లకు పరుగులు తీశారు. ఈ క్రమంలోనే ఇప్పటికే సినిమాను వీక్షించిన మెగా హీరోస్ సాయి ధరంతేజ్, వైష్ణవ తేజ్, అకిరా నందన్, అలాగే డైరెక్టర్ హరీష్ శంకర్, ప్రొడ్యూసర్ ఎస్ కే ఎన్ లాంటి స్టార్ సెలబ్రెటీస్ చాలామంది సినిమాను వీక్షించారు.

పవన్ మూవీ పై తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇక నాచురల్ స్టార్ నాని సైతం సినిమాను వీక్షించి తన ట్విటర్ వేదికగా అభిప్రాయాలను వ్యక్తం చేసుకున్నాడు. వేరే వాళ్ళ మాటలు అసలు వినకండి.. ఒరిజినల్ జియాంట్ బ్లాక్ బ‌స్టర్ అంటూ రాసుకొచ్చాడు. పవన్ కళ్యాణ్, సుజిత్, థ‌మన్ గార్లకు అలాగే ఓజీ టీం మొత్తానికి నా అభినందనలు అంటూ విషెస్ తెలియజేసాడు. ఇక మరో స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశి.. ఓజీ పైన అభిప్రాయాన్ని షేర్ చేసుకుంటూ.. నిజంగానే ఫైర్ స్ట్రామ్‌లా మూవీ దూసుకెళ్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. ప్రతిక్షణం మాస్ మ్యాడ్‌నెస్‌తో నిండిపోయిందని.. పవన్ ఎంట్రీ సీన్స్ నెక్స్ట్ లెవెల్ అంటూ.. పోలీస్ స్టేషన్ బ్లాక్ అయితే గూస్బంస్ తెప్పిస్తున్నాయని.. ఎక్కడ చూసినా హై మూమెంట్స్ వచ్చాయని.. పవన్ కు కన్నులు పండగగా ఉందని రాసుకోచ్చాడు.

ఇక సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థ‌మన్ బిజిఎం ప్రతి ఫ్రేమ్ ని ఎలివేట్ చేసిందని.. నిజంగానే ర్యాంప్ ఆడిస్తుంది. ఇప్పుడు హంగ్రీ చీతా వేట ప్రారంభమైందంటూ రాసుకొచ్చాడు. టీం మొత్తానికి తన విషెస్ తెలియజేసాడు. ఇక.. టాలీవుడ్ మరో డైరెక్టర్ కె ఎస్ రవీంద్రబాబు ట్విట్టర్ వేదికగా అసలైన ఒరిజినల్ గ్యాంగ్ స్టార్‌ను ఎంతో ఇంట్రెస్టింగ్ గా చూసే అవకాశం వచ్చింది.. పవర్ స్టార్ పవన్ యాక్టింగ్ అదుర్స్.. ఆయన్ని డైరెక్టర్ సుజిత అద్భుతంగా చూపించాడు.. థ‌మన్ మ్యూజిక్ గురించి మాటల్లోనే చెప్పలేం.. నిజంగా ఇది బ్లాక్ బస్టర్ సినిమా అంటే చెప్పుకొచ్చారు. ఇక వీళ్ళతో పాటే పలువురు సినీ ప్రముఖులు కూడా తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.